ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుహైదరాబాద్లో కుండపోత వర్షం Hyderabad Rains Today : హైదరాబాద్ మహానగరాన్ని వరణుడు మరోసారి వణికించేస్తున్నాడు. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. రహదారులన్నీ జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో అవస్థలు పడుతున్నారు.టీకాంగ్రెస్ ముఖ్యనేతలకు హైకమాండ్ పిలుపుతెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. పార్టీలో చేరికలు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరగనుంది.రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. GST Collection July 2022: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2022 జులై నెలలో రూ.1.48 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇది జీవితకాల రెండో గరిష్ఠమని తెలిపింది. గత ఏడాది జులైలో వసూలైన జీఎస్టీ ట్యాక్స్ కన్నా 28% శాతం అధికంగా ఈ సారి రాబడి వచ్చిందని స్పష్టం చేసింది.'ఇప్పుడు దర్జాగా సినిమా చూసుకో అచింత!'.. మోదీ ట్వీట్Achinta Modi Tweet: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు మూడో బంగారు పతకాన్ని అందించిన అచింతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 'అనుకున్న మెడల్ గెలిచేశావుగా.. ఇప్పుడు దర్జాగా వెళ్లి మూవీ చూడు' అంటూ అచింతకు మోదీ స్పెషల్ విషెస్ తెలిపారు.బంగారం ధర నేడు ఎంతంటే.. తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల పసిడి ధర రూ.53,060 ఉండగా.. కిలో వెండి ధర రూ.59,540 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.మాజీ ప్రధానిని చూసి.. ఏడ్చేసిన కుమారులుకర్ణాటక మండ్యలో జరిగిన జేడీఎస్ పార్టీ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్న. అనారోగ్య కారణాలతో సభకు వర్చువల్‌గా హాజరైన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను తెరపై చూసి విలపించారు.పాటలు పాడుతూ ఎంపీ రిక్వెస్ట్ తమిళనాడులో ఈరోడ్‌లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లెనిన్ ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి కేరళ ఎంపీ రమ్య హరిదాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.గుడ్ న్యూస్.. వంట గ్యాస్ ధర తగ్గింపు.. ఎంతంటే...LPG price cut news: వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నుంచి రూ.36 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా దిల్లీలో ఇప్పటివరకు రూ.2,012.50గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1,976కు చేరింది. అంతకుముందు జులై 6న గ్యాస్ సిలిండర్ ధర రూ.8.5 తగ్గింది.సామ్‌తో మళ్లీ అలా చేస్తానో లేదో : నాగచైతన్య Nagachaitanya Samantha: ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య, హీరోయిన్ సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యువ హీరో నాగచైతన్య. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. ఏంటంటే?తాప్సీ గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు తెలుసా?తాప్సీ పన్ను... టాలీవుడ్‌తో కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్, కమర్షియల్, బయోపిక్‌లు అంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సొంతం చేసుకుంది. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం...