తెలంగాణ

telangana

ETV Bharat / state

"నాన్న కూతురిగా కాదు.. తమిళిసైగా ఎదగాలనుకున్నాను" - governor tamilisai latest news

తమిళిసై సౌందర రాజన్... తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా గవర్నర్. రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచే తనదైన శైలితో అందరికీ చేరువైన తత్వం ఆమెది. చిన్న నాటి నుంచి రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో పెరిగిన తమిళిసై సౌందరరాజన్... తండ్రి బాటలో అడుగువేసినా.. ఆయన సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమైన పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. వైద్యురాలిగా, రాజకీయ నేతగా, నేడు గవర్నర్​గా వివిధ బాధ్యతల్లో ఉన్నా.. ఎప్పుడూ నిబద్ధత అనే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు సాగానంటున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి...

etv-bharat-womens-day-special-face-to-face-with-governor-tamilisai
"నాన్న కూతురిగా కాదు.. తమిళిసైగా ఎదగాలనుకున్నాను"

By

Published : Mar 8, 2020, 7:11 AM IST

Updated : Mar 8, 2020, 7:31 AM IST

నాన్న ఆర్నెళ్లు మాట్లాడలేదు

చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఇష్టం ఉండేదని... కష్టపడే తత్వం ఉన్న నాన్నను చూస్తూ పెరిగానని గవర్నర్​ తమిళిసై తెలిపారు. అమ్మ కోరిక మేరకు డాక్టర్​ను అయ్యానని, తన ఇష్టం మేరకు రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. రాజకీయాల్లో చేరతానన్నందుకు నాన్న ఆర్నెళ్లు మాట్లాడలేదని తమిళిసై వివరించారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

నాన్న అనుచరులే ఉరేసుకోమన్నారు

మెుదట్లో తన తండ్రి అనుచరులే ఉరేసుకోమని అన్నారని... అంత తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారని గవర్నర్​ వెల్లడించారు. ఇప్పుడు తన విషయంలో అందరూ గర్వపడుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఆడపడచులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. జీవితంలో ఒక్క విజయంతో ఆగిపోకూడదని... ముందుకెళ్లే కొద్దీ సాధించే లక్ష్యాలెన్నో ఉంటాయని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ స్పష్టం చేశారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి
Last Updated : Mar 8, 2020, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details