తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ న్యూస్​ 9PM - undefined

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

ETV BHARAT TOP NEWS
ETV BHARAT TOP NEWS

By

Published : Aug 13, 2022, 9:00 PM IST

  • ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ అంటున్న జీవితా రాజశేఖర్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకున్న సందర్భంగా జీవిత కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని సినీనటి జీవితా రాజశేఖర్‌ అన్నారు.

  • అక్కంప్లలి జలాశయంలో పడి ముగ్గురు బీ ఫార్మసీ విద్యార్థులు మృతి

B Pharmacy students died: నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది స్నేహితులు కలిసి విహారయాత్రకు నాగార్జునసాగర్ వెళ్లారు. సాగర్​లో సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్​కు వెళ్తుండగా.. మార్గమధ్యలో ఉన్న అక్కంపల్లి జలాశయానికి కూడా వెళ్లారు. అప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన స్నేహబృందపు సంతోషం.. ఎక్కువసేపు నిలువలేకపోయింది. ముగ్గురు విద్యార్థులను మృత్యువు మింగేసింది.

  • ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ పత్రిక ప్రకటన చేశారు. పేదల సంక్షేమ పథకాలపై మోదీకి ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. అసలు తమ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి అని మండిపడ్డారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా? అని విరుచుకుపడ్డారు.

  • కాల్పుల ఘటనపై మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఏమన్నారంటే

Minister Srinivas goud firing: మహబూబ్‌నగర్‌ ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపటం కలకలంరేపింది. జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌ టవర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ర్యాలీ ప్రారంభ సమయంలో తుపాకీతో గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి కాల్పులు జరపటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

  • వేధించిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టిన మహిళలు

రోడ్డుపై వేధింపులకు గురిచేసిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టారు ఇద్దరు మహిళలు. ఎవరో వీడియో తీసి సోషల్​ మీడియాలో షేర్​ చేయగా.. దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని ఇగ్లాస్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. అనంతరం బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

  • అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న మైనర్​పై గ్యాంగ్​రేప్​

అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఓ మైనర్​​పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. ఈ దారుణం బిహార్​లో జరిగింది. మరోవైపు, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన రోగికి మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • లాల్​ సింగ్​ చడ్డా సినిమాకు ఆస్కార్​ గుర్తింపు నెటిజన్లు ఫైర్​

బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ ఖాన్​ హీరోగా తెరకెక్కిన లాల్​ సింగ్​ చడ్డా సినిమాను ఆస్కార్​ అకాడమీ గుర్తించింది. ట్విట్టర్​ ద్వారా మద్దతు తెలిపింది. భారతీయులకు అనుగుణంగా కథను మార్చుకున్నారంటూ ఓ వీడియో షేర్​ చేసింది. మరోవైపు, హీరోయిన్​ కరీనాకపూర్​ బాయ్​కట్​ లాల్​ సింగ్​ చడ్డా ట్యాగ్​లైన్​పై స్పందించారు.

  • ఎస్​బీఐ కీలక నిర్ణయం ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

SBI FD Interest Rates దేశీయ అతిపెద్ద ప్ర‌భుత్వరంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. పెంచిన వ‌డ్డీ రేట్లు నేడు (2022 ఆగ‌ష్టు 13) అమ‌ల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ ప్ర‌స్తుతం 7 రోజుల నుంచి మొద‌లుకుని 10 ఏళ్లు వ‌ర‌కు వివిధ కాల‌ప‌రిమితుల గ‌ల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 2.90 శాతం నుంచి 5.65 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేటును అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్లకు మ‌రో 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది.

  • డకౌట్​ అయ్యానని ఆ ఫ్రాంచైజీ ఓనర్ చెంపదెబ్బలు కొట్టాడన్న మాజీ ప్లేయర్​

Ross Taylor RR Team: కివీస్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ సంచలన విషయం బయటపెట్టాడు. భారత టీ20 లీగ్‌లో ఆడినప్పుడు ఓ ఫ్రాంచైజీ యజమాని తన మొహం మీద ఓ మూడు, నాలుగుసార్లు కొట్టాడని ఆరోపించాడు. ఇదే విషయాన్ని తన జీవిత చరిత్ర 'బ్లాక్‌ అండ్ వైట్' పుస్తకంలో వెల్లడించాడు. ఈ వారంలోనే ఈ బుక్‌ విడుదలైంది. రాజస్థాన్‌ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని టేలర్‌ అందులో పేర్కొన్నాడు.

  • ఫ్యాన్స్​కు అందుబాటులో స్టార్​ హీరో నిజంగా వచ్చానంటూ వీడియో రిలీజ్​

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ ఇకపై అభిమానులకు మరింత చేరువగా ఉండనున్నారు. తన సినిమా అప్డేట్లతో పాటు ఇతర ముఖ్యమైన విషయాలను వీలైనంత ఎక్కువమంది అభిమానులకు చేర్చనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ఆయన తాజాగా నటించిన కోబ్రా సినిమాకు సంబంధించిన​ అప్డేట్​ను మేకర్స్ ప్రకటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details