తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

etv bharat top news
ఈటీవీ భారత్

By

Published : Sep 28, 2021, 5:51 AM IST

Updated : Sep 28, 2021, 10:09 PM IST

21:57 September 28

టాప్​న్యూస్ ​@10 PM

  • హుజూరాబాద్​ ఉపపోరుకి కౌంట్​డౌన్.. 

హుజురాబాద్‌ ఉపఎన్నికల నగారా(huzurabad by election 2021)తో రాష్ట్రంలో ఎన్నికల వేడి(Political Heat in Huzurabad) మరింత పెరగనుంది. ఇప్పటికే అధికార తెరాస, భాజపా నువ్వా-నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి విజయం సాధించి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈటల వంటి నేతను మట్టికరిపించి పార్టీకి ఎదురులేదు.. ఎదురుగాలి లేదని నిరూపించాలని తెరాస భావిస్తోంది.

  • తీపికబురు..

       రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది.  

  • 'సిద్ధూ వెంటే మేము'.. 

పంజాబ్​లో పలువురు మంత్రులు, కీలక నేతలు సిద్ధూ బాటలో నడుస్తున్నారు. పీసీసీ చీఫ్​ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధూ (Navjot Singh Sidhu resignation) ప్రకటించిన నేపథ్యంలో.. పలువురు నేతలు సైతం తమ పదవులను వదులుకున్నారు. రెండు రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రజియా సుల్తానా సైతం.. తన పదవికి రాజీనామా చేశారు.

  • 'సుదీర్ఘకాలంపాటు కరోనా వ్యాప్తి!'

సుదీర్ఘకాలంపాటు కరోనా(Coronavirus) వ్యాప్తి కొనసాగే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్​ఓ(Who On Covid 19) తెలిపింది. భవిష్యత్తులో వైరస్​ వ్యాప్తి తగ్గడం అనేది ప్రజల్లో ఏర్పడే రోగ నిరోధక శక్తి స్థాయులపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. 'కొవాగ్జిన్' టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చే(Covaxin Who Approval News) విషయంపై సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే అనుమతులు లభిస్తాయని స్పష్టం చేసింది.

  • ముంబయి లక్ష్యం 136

ఐపీఎల్ 2021(IPl 2021 News)లో భాగంగా ముంబయి ఇండియన్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 135 పరుగులు చేసింది. మర్క్​రమ్ (42), హుడా (28) ఆకట్టుకున్నారు.

20:51 September 28

టాప్​న్యూస్ ​@9PM

  • మూసినదికి వరద ఉద్ధృతి

గులాబ్​ తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరువానలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో సోమవారం నాటి వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగ్యనగరంలో జంట జలాశయాలైన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ గేట్లను ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసికి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాాలకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీచేశారు.

  • జిల్లాల్లో గులాబ్​ ఎఫెక్ట్​.. 

గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు దాటేందుకు ప్రయత్నించినవారు కొందరు అందులో పడగా.. కొందరు బయటపడగా.. మరికొందరు గల్లంతయ్యారు.

  • వరుణుడి బీభత్సానికి 10 మంది బలి

భారీ వర్షాలు మహారాష్ట్రను(Maharashtra Rain News) ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా 48 గంటల వ్యవధిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు ధ్వంసయ్యాయి. ఎన్నో పశువులు మరణించాయి. మరోవైపు.. రానున్న రెండు రోజుల్లో కూడా ఆ రాష్ట్రంలో(Maharashtra Rain News) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు.. ఆందోళన కలిగిస్తున్నాయి.

  • బాలికపై గ్యాంగ్ రేప్- సిగరెట్​తో కాల్చి..

దేశంలో మహిళలపై(crime news today) ఆఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాలికలను కూడా విడిచిపెట్టడం లేదు(crime news india). తాజాగా.. మధ్యప్రదేశ్​లో(mp crime news) అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15 ఏళ్ల బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఛాతిపై కాలుతున్న సిగరెట్​ను పెట్టి పైశాచికానందాన్ని పొందారు. అనంతరం ఆమెను చెట్టుకు వెలాడదీసి హత్యచేశారు.

  • ప్రముఖ నటితో ఈవెంట్ ఆర్గనైజర్స్ గొడవ

బాలీవుడ్ నటి అమీషా పటేల్(ameesha patel movies) పాల్గొన్న ఓ ఈవెంట్​లో గందరగోళం నెలకొంది. స్టేజ్​పై నుంచి అనుకున్న సమయం కంటే ముందే దిగిపోయిందని ఆర్గనైజర్స్​ గొడవ చేయడమే ఇందుకు కారణం.

20:04 September 28

టాప్​న్యూస్ ​@8PM

  • కేఆర్​ఎంబీకి తెలంగాణ మరో లేఖ

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ మరో లేఖ రాసింది. ఏపీ నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని తెలంగాణ కోరింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టవద్దని వినతి చేసింది. లేఖలోని అంశాలను జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని లేఖలో తెలంగాణ కోరింది.

  • పంజాబ్​లో కాంగ్రెస్ దారెటు? 

కాంగ్రెస్​ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పంబాబ్​లో గత కొద్దినెలలుగా నెలకొన్న సంక్షోభం(punjab congress crisis) నూతన సీఎం ఎంపికతో ముగిసిందని భావిస్తున్న తరుణంలో నవ్​జ్యోత్ సింగ్​ సిద్ధూ షాక్ ఇచ్చారు. పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మాజీ సీఎం అమరీందర్ సింగ్ భాజపాలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంలో అయోమయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్​లో కాంగ్రెస్​ భవిష్యత్​ ఎలా ఉండనుంది? కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏమేరకు ప్రభావం చూపగలదు? అమరీందర్, సిద్ధూకు దీటుగా... రాష్ట్రస్థాయిలో ప్రజాదరణ గల నేతలు ఎవరైనా ఉన్నారా? అనే విషయలు చర్చనీయాంశమయ్యాయి.

  • రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన 'బార్బర్'.. 

ఆదివారం చెన్నై సూపర్​కింగ్స్​, కోల్​కతా నైట్​రైడర్స్(CSKvKOL)​ మ్యాచ్​.. సెలూన్​ షాప్​ నడిపే వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదివేయండి.

  • 'పుష్ప' ట్రీట్​కు టైమ్​ ఫిక్స్​​.. 

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో 'పుష్ప', 'షంషేరా', 'పెళ్లిసందD' సహా పలు చిత్రాల వివరాలు ఉన్నాయి.

  • దిల్లీపై కోల్​కతా విజయం.. 

ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లింది కోల్​కతా నైట్​రైడర్స్(kolkata knight riders team). దిల్లీ క్యాపిటల్స్​(KKR vs DC 2021)తో జరిగిన మ్యాచ్​లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

18:54 September 28

టాప్​న్యూస్ ​@7PM

  • పోసానిపై దాడికి పవన్ ఫ్యాన్స్​ యత్నం

హైదరాబాద్​లో పోసాని కృష్ణమురళిపై దాడికి పవన్ అభిమానుల యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. పోసానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పవన్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న పోసాని.. రేపు పోలీసులకు ఫిర్యాదుచేయనున్నట్లు తెలిపారు. 

  • తెలంగాణ టాప్​!

దేశంలోని ఇతర ప్రాంతాల్లో పోల్చితే.. దక్షిణాది రాష్ట్రాల్లోని కుటుంబాల్లోనే అప్పులు(Household Debt) అధికంగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో అప్పులు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.

  • బాధితురాలిపై కానిస్టేబుల్​​ దాష్టీకం.. 

అత్యాచార బాధితురాలన్న కనికరం లేకుండా ప్రవర్తించాడు ఓ పోలీస్​ కానిస్టేబుల్​. దర్యాప్తు పేరుతో తనపై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో సదరు కానిస్టేబుల్​ను పోలీసులు అరెస్టు చేశారు.

  • 2.4లక్షల మందితో నిఘా!

2017లో చైనా(india china border news) చేపట్టిన 628 ఆధునిక గ్రామాల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. దీనిపై రేపో, మాపో చైనా అధికారిక ప్రకటన చేసే అవకాశముంది(india china relations). ఈ గ్రామాలు భారత్​ సరిహద్దు వెంబడి చైనా నిర్మించడం గమనార్హం. సరిహద్దు వెంబడి జనాభాను(china population) పెంచుకునేందుకు చైనా ఈ ఎత్తుగడ వేసినట్టు నిపుణులు భావిస్తున్నారు.

  • 'పుష్ప' అనుకున్న టైమ్​కు రిలీజ్ అయ్యేనా?

సుకుమార్(pushpa latest updates)​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. ఈ చిత్రం ముందుగా అనుకున్న తేదీకి(Pushpa Release Date) విడుదలయ్యే పరిస్థితులు కనపడుట లేదు. కొత్త రిలీజ్​ డేట్​ కోసం చిత్రబృందం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.

 

17:55 September 28

టాప్​న్యూస్ ​@6PM

  • జిల్లాల్లో గులాబ్​ ఎఫెక్ట్​.. 

గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు దాటేందుకు ప్రయత్నించినవారు కొందరు అందులో పడగా.. కొందరు బయటపడగా.. మరికొందరు గల్లంతయ్యారు.

  • కాంగ్రెస్​లో చేరిన కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని

యువ రాజకీయ నేతలు కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని.. కాంగ్రెస్​లో (Kanhaiya kumar Congress) చేరారు. దిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ హస్తం కండువా కప్పుకున్నారు.

  • సత్య నాదెళ్ల షాకింగ్ కామెంట్స్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో టిక్​టిక్​ డీల్ వ్యవహారంపై(microsoft tiktok acquisition) ఆసక్తికర విషయాలు వెల్లడించారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(satya nadella news). తన జీవితంలో అదే క్లిష్టమైన, వింతైన డీల్​ అని చెప్పారు. ఆ డీల్​ పూర్తయితే సరికొత్త చరిత్ర అవుతుందని అప్పుడు తాను అనుకున్నట్లు వెల్లడించారు.

  • సంక్రాంతి బరిలో 'ఆర్ఆర్ఆర్'.. 

'ఆర్​ఆర్​ఆర్'(RRR movie release date)​ కొత్త రిలీజ్​ డేట్​ ఇదేనంటూ ప్రస్తుతం నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

  • ఒలింపిక్ స్టార్స్​కు ప్రమోషన్లు

ఒలింపిక్స్​(olympics 2020)లో సత్తాచాటిన పలువురు క్రీడాకారులకు ప్రమోషన్లు లభించాయి. దీనికి సంబంధించి సాయ్ 55వ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

16:50 September 28

టాప్​న్యూస్ ​@5 PM

  • వరదల నుంచి కలెక్టర్​ ఎలా బయటపడ్డారంటే..?

సిరిసిల్లలో కురుస్తున్న భారీ వర్షాలతో సమీకృత నూతన కలెక్టరేట్ జలదిగ్బంధమైంది. కలెక్టరేట్ చూట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. నిలిచిన నీటితో కలెక్టరేట్‌లోకి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సిబ్బందితో కలిసి బయటకు వచ్చేందుకు కలెక్టర్​.. చాకచక్యంగా వ్యవహరించారు. సిబ్బందితో కలిసి ముంపును ఎలా దాటారంటే..?

  • కుక్కను మింగేసిన కొండ చిలువ.. ఆ తర్వాత 

ఆహారం కోసం వెతుకుతూ.. జనావాసంలోకి వచ్చిన ఓ కొండ చిలువ.. కుక్కను మింగేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి కదల్లేక అవస్థలు పడింది. ఇది గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండ చిలువను కాపాడి.. సమీపంలోని అరణ్యంలో విడిచిపెట్టారు. కేరళలోని త్రిస్సూర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

  • డ్రైవర్​ లేకుండానే రోడ్డుపై చక్కర్లు కొట్టిన ఆటో!

డ్రైవర్​ లేకుండానే ఓ ఆటో రోడ్డుపై చక్కర్లు కొట్టింది. మధ్యప్రదేశ్​ శివపురీలోని మాధవ్​ చౌక్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మొదట ఆటో బోల్తా పడగా.. దానిని లేపేందుకు డ్రైవర్​ సహా స్థానికులు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా స్టార్ట్​ అయిన ఆటో ముందుకు దూసుకెళ్లింది. కాసేపు.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాస్త ముందుకెళ్లి ఆగగా.. ఊపిరిపీల్చుకున్నారు.

  • వెనక్కి తగ్గని 'కిమ్​'​.. 

ఉభయ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుస బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగాలు చేపడుతూ వస్తున్న ఉత్తర కొరియా.. మరోసారి షార్ట్​ రేంజ్​ మిస్సైల్​ను సముద్రంలోకి ప్రయోగించింది. ఈ చర్యను అమెరికా ఖండించింది.

  • కొత్త సినిమా కబుర్లు..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'పుష్పక విమానం'(Pushpaka Vimanam 2021 Release Date), 'ఒరేయ్​ బామ్మర్ది'(Orey Bamardhi Release Date) చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

15:51 September 28

టాప్​న్యూస్ ​@4 PM

  • హైదరాబాద్​ పలు ప్రాంతాల్లో హైఅలర్ట్​

గులాబ్​ తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరువానలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో సోమవారం నాటి వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగ్యనగరంలో జంట జలాశయాలైన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ గేట్లను ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసికి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాాలకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీచేశారు.

  • పంజాబ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్

పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పంజాబ్ భవిష్యత్, సంక్షేమ అజెండా విషయంలో రాజీ పడడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు.

  • పవన్​ వ్యాఖ్యలపై మంచు విష్ణు కామెంట్స్​

'మా'(Maa elections 2021) ఎన్నికల్లో మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ తనకెే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మంచు విష్ణు(Maa elections manchu vishnu panel). 'రిపబ్లిక్'​ ప్రీరిలీజ్​ ఈవెంట్​లో పవన్​ చేసిన వ్యాఖ్యలకు తాను ఏకీభవించట్లేదని అన్నారు.

  • అగ్రస్థానం కోల్పోయిన మిథాలీ

ఐసీసీ (ICC odi ranking) తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్(icc women's odi ranking)​లో అగ్రస్థానాన్ని కోల్పోయింది టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్. భారత పేసర్ జులాన్ గోస్వామి రెండో ర్యాంకుకు చేరుకోగా.. స్మృతి మంధాన తన ర్యాంకును మెరుగుపర్చుకుంది.

 

  • మార్కెట్ జోరుకు బ్రేక్​

స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ (Sensex Today) 410 పాయింట్లు తగ్గి 59,700 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 106 పాయింట్ల నష్టంతో 17,750 మార్క్​ కోల్పోయింది.

14:46 September 28

టాప్​న్యూస్ ​@ 3PM

  • రెండురోజుల వర్షానికే...

హైదరాబాద్​లో రెండు రోజుల వర్షానికే అసెంబ్లీని వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని(raghunandan rao fires on trs) ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. వ్యాక్సిన్(covid vaccine) తయారీకి రాష్ట్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని(cm kcr family) విమర్శిస్తే రాష్ట్రాన్ని విమర్శించినట్లు కాదని అన్నారు.

  • క్లాస్​రూమ్​లో డాన్స్​.. 

ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలో టీచర్లు డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బాలీవుడ్​ పాటలకు నృత్యం చేశారు. ఈ విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు.. పాఠశాలలో అనుచితంగా ప్రవర్తించిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్​ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఆగ్రాలో జరిగింది ఈ ఘటన.

  • తాలిబన్ల దుశ్చర్య

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు(Afghanistan Taliban) తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. తఖార్​ ప్రాంతంలో చిన్న పిల్లాడికి (Taliban Executes Child) మరణశిక్ష విధించారు. తండ్రి.. తిరుగుబాటు దళ సభ్యుడనే అనుమానంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

  • చాహల్​ను ఎందుకు ఎంపిక చేయలేదు?'

ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup)​ టీమ్ఇండియా స్క్వాడ్​లో స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ను ఎంపిక చేయకపోవడంపై మాజీ బ్యాట్స్​మన్​ వీరేంద్ర సెహ్వాగ్​ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అద్భుతంగా బౌలింగ్​ చేస్తున్న చాహల్​ను(Chahal Selection) జట్టు నుంచి తప్పించడానికి కారణమేంటని బీసీసీఐ సెలెక్టర్లను సూటిగా ప్రశ్నించాడు.

  • అక్టోబర్​లో బ్యాంకులకు 21 సెలవులు!

ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే! ఆర్‌బీఐ ప్రకారం అక్టోబర్​లో బ్యాంకులు 21 రోజులు (Bank Holidays In October 2021) సెలవులో ఉండనున్నాయి(అన్ని రాష్ట్రాల్లో కలిపి). పండుగలు, ఇతర కారణాలతో బ్యాంకులు పని చేయవు. ప్రాంతాల వారీగా బ్యాంక్​ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

13:49 September 28

టాప్​న్యూస్ ​@ 2PM

  • హుజూరాబాద్​ ఉపపోరుకి కౌంట్​డౌన్

హుజురాబాద్‌ ఉపఎన్నికల నగారా(huzurabad by election 2021)తో రాష్ట్రంలో ఎన్నికల వేడి(Political Heat in Huzurabad) మరింత పెరగనుంది. ఇప్పటికే అధికార తెరాస, భాజపా నువ్వా-నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి విజయం సాధించి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈటల వంటి నేతను మట్టికరిపించి పార్టీకి ఎదురులేదు.. ఎదురుగాలి లేదని నిరూపించాలని తెరాస భావిస్తోంది.

  • 2రోజుల వర్షానికే వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి

హైదరాబాద్​లో రెండు రోజుల వర్షానికే అసెంబ్లీని వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని(raghunandan rao fires on trs) ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. వ్యాక్సిన్(covid vaccine) తయారీకి రాష్ట్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని(cm kcr family) విమర్శిస్తే రాష్ట్రాన్ని విమర్శించినట్లు కాదని అన్నారు.

  • భాజపాలో చేరనున్న పంజాబ్ మాజీ సీఎం ?

పంజాబ్ శాసనసభ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(amarinder singh news)​ కాంగ్రెస్​కు షాక్​ ఇవ్వడం ఖాయమా? తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు(amarinder singh bjp).

  • ఒక్క మ్యాచ్​ ఓడినా ఆశలు గల్లంతే!

ముంబయి ఇండియన్స్‌కు(Mumbai Indians News) ఏమైంది? గత రెండు సీజన్లలో టైటిల్‌ సాధించి.. ఈసారి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆశిస్తున్న ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచింది. మరీ ముఖ్యంగా ఆదివారం రాత్రి బెంగళూరుతో(RCB Vs MI) తలపడిన సందర్భంగా 111 పరుగులకే కుప్పకూలి.. ఈ సీజన్‌పై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరింది. 

  • 'మా' అధ్యక్ష పదవికి విష్ణు నామినేషన్

12:49 September 28

టాప్​న్యూస్ ​@ 1PM

  • హుజూరాబాద్​ ఉపపోరు.. ఎవరి బలాలేంటి?

హుజురాబాద్‌ ఉపఎన్నికల నగారా(huzurabad by election 2021)తో రాష్ట్రంలో ఎన్నికల వేడి(Political Heat in Huzurabad) మరింత పెరగనుంది. ఇప్పటికే అధికార తెరాస, భాజపా నువ్వా-నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి విజయం సాధించి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈటల వంటి నేతను మట్టికరిపించి పార్టీకి ఎదురులేదు.. ఎదురుగాలి లేదని నిరూపించాలని తెరాస భావిస్తోంది.
 

  • మ్యాట్రిమోనీలో చూసి వలేశాడు..

'మ్యాట్రిమోనీ వెబ్​సైట్​లో మీ పొఫైల్ చూశా.. బాగా నచ్చింది. ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నాను. రూ.లక్షకు పైగా జీతం వస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం' అంటూ ఆమెను నమ్మించాడు(love fraud in hyderabad) ఓ వ్యక్తి. ఏకాంతంగా గడపుదామని ప్రతిపాదించాడు(cheating with marriage proposal). కట్​చేస్తే ఆ వీడియోలు అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

  • జలదిగ్బంధంలో సిరిసిల్ల

గులాబ్ తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు.

  • ఆ ఉపఎన్నికలో మార్పు లేదు

బంగాల్​ భవానీపుర్​ ఉపఎన్నిక (Bhawanipur election) షెడ్యూల్​ ప్రకారమే జరగాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఎన్నిక వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్​ను తాత్కాలిక సీజే జస్టిస్​ రాజేష్​ బిందాల్​, జస్టిస్​ ఆర్​. భరద్వాజ్​ సభ్యులుగా గల ధర్మాసనం. అయితే ఎన్నిక జరగాలని బంగాల్​ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(సీఎస్​).. ఈసీకి లేఖ రాయడం కూడా సరైనది కాదని తేల్చిచెప్పింది.

  • ఆమె నటనకు షాహిద్ కపూర్ ఫిదా!

'కబీర్​సింగ్​' చిత్రంతో మరింత క్రేజ్​ తెచ్చుకున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఫ్యాన్స్​తో జరిగిన చిట్​చాట్​లో ఓ టాలీవుడ్​ హీరోయిన్​తో వర్క్​ చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే షాహిద్​ను ఫిదా చేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
 

11:44 September 28

టాప్​న్యూస్​@12NOON

  • వరదల్లో కొట్టుకుపోయిన బస్సు

మహారాష్ట్రలో భారీ వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. యావత్​మాల్​ జిల్లాలో వరద ఉద్ధృతికి ఓ బస్సు నదిలో కొట్టుకుపోయింది.​ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నదిలో ఎవరైనా కొట్టుకుపోయారా అనేది తెలియాల్సి ఉంది.

  • పోలీసుల పేరుతో దందాలు

వరంగల్‌ మిల్స్‌కాలనీలో లిక్కర్‌డాన్‌ కుమారుడి (Warangal Liquor Don son)పై అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కేసు నమోదైంది. పోలీసుల విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత సదరు వ్యక్తితో సంబంధం ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • పాత్రలో పోలియో కేంద్రానికి శిశువు

తన చిన్నారికి టీకా (Polio News) వేయించేందుకు ఓ తండ్రి భారీ వర్షాన్ని, వరదలను దాటుకుంటూ వెళ్లాడు. వాహనాలు తిరిగని పరిస్థితిలో ఓ పాత్రలో పాపను పడుకోబెట్టి ఆరోగ్య కేంద్రానికి మోసుకెళ్లాడు.

  • ఉగ్ర సంస్థలకు స్వర్గధామంగా పాకిస్థాన్​..!

పాకిస్థాన్​ కేంద్రంగా ఉగ్రవాదం (Pak terror news) పెరిగిపోతోందని.. అమెరికా కాంగ్రెషనల్​ రిపోర్టు తెలిపింది. దాదాపు 12 విదేశీ ఉగ్రవాద సంస్థలు.. పాక్​ నుంచే ఉగ్రకార్యకలాపాలు (Terrorist attack) కొనసాగిస్తున్నాయని పేర్కొంది. ఆ దేశంలో ఉగ్రవాద నివారణ చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని చురకలు అంటించింది.

  • మళ్లీ ఎగరనున్న బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానాలు

వరుస ప్రమాదాల కారణంగా నిషేధం ఎదుర్కొన్న బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు మళ్లీ సేవలందించేందుకు (Ban lifted on Boeing 737 MAX) సిద్ధమవుతున్నాయి. అవసరమైన మార్పులు చేసిన తర్వాత ఈ విమానాల సేవలకు అనుమతులు లభించాయి. అక్టోబర్​ 5 నుంచి.. 737 మ్యాక్స్‌ విమానానాలను పునఃప్రారంభిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ (Boeing 737 MAX restart) ప్రకటించింది.

10:53 September 28

టాప్​న్యూస్​@11AM

  • ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad By Election 2021) షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు తెలిపింది. వాటి ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించింది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

  • భార్య హత్యకు ఆన్​లైన్​లో షాపింగ్

హైదరాబాద్​ బాచుపల్లి పీఎస్​ పరిధిలోని ప్రగతినగర్​లో నవవధువు హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజుల క్రితమే ప్రేమపెళ్లి చేసుకున్న భార్యను హతమార్చడానికి ముందుస్తుగా ప్రణాళిక రచించినట్లు తెలిసింది. దీనికోసం అతను మడత చాకు(ఫోల్డెడ్ నైఫ్​)ను ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

  • దిగొచ్చిన పసిడి.. ప్రస్తుత ధర..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర కాస్త దిగొచ్చింది. వెండి (Silver price today) ధర కూడా స్వల్పంగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

  • గంగూలీకి హైకోర్టు జరిమానా

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కోల్​కతా హైకోర్టు.. 10 వేల జరిమానా విధించింది. కోల్‌కతా సమీపంలో పాఠశాల నిర్మాణం కోసం గంగూలీకి అక్రమ పద్ధతుల్లో ప్లాట్‌ కేటాయించారని.. కోల్‌కతా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తేల్చింది. బంగాల్ ప్రభుత్వానికి రూ.50వేలు, బంగాల్ హౌసింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.50వేల చొప్పున జరిమానా విధించింది.

  • ఇస్మార్ట్​ డైరెక్టర్​.. పూరీ

ఎవరు సినిమా తీస్తే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందో.. ఆయనే పూరీ జగన్నాథ్‌. సినిమాను విభిన్న శైలిలో తీస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడీ డైరక్టర్. మాస్ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచిన పూరీ.. నేడు 56వ వసంతంలోకి(Puri Jagannadh Birthday) అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన సినీకెరీర్​పై ప్రత్యేక కథనం.

09:49 September 28

టాప్​న్యూస్​@10AM

  • ప్రేమజంట ఆత్మహత్య

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మేళ్లచెరువులో విషాద ఘటన చోటుచేసుకుంది. మేళ్లచెరువు వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

  • ఐపీఎల్​లో 'వాట్సాప్' బెట్టింగ్

ఐపీఎల్​ క్రికెట్ మ్యాచ్​లు ప్రారంభం అవ్వడం.. ఇటు క్రికెట్​ ప్రియుల్లో ఎంత ఆనందాన్ని నింపుతుందో.. అటు బెట్టింగ్(IPL BETTING IN TELANGANA) రాయుళ్లకు అంతే ఆశ కలిగిస్తోంది. మ్యాచ్​లు ప్రారంభమైన నాటి నుంచి బెట్టింగ్​లు జోరందుకుంటున్నాయి. మొబైల్​ ఫోన్​ ద్వారా బెట్టింగ్​ల(IPL BETTING IN TELANGANA)కు పాల్పడుతూ ఎంతో మంది యువత అప్పుల పాలవుతున్నారు. చివరకు డబ్బు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

  • దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు (Coronavirus update) 201రోజుల తర్వాత 20వేల దిగువకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 18,795 మంది వైరస్​ (Coronavirus India) బారినపడ్డారు. మరో 26,030 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. మరో 179 మంది మృతిచెందారు.

  • మళ్లీ పెరిగిన ఇంధన​ ధరలు

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. మంగళవారం దిల్లీలో (Fuel Price Today) లీటర్​ పెట్రోల్​ ధర 19 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 25 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.42కు చేరగా.. డీజిల్​ ధర రూ. 89.58కు పెరిగింది.

  • పాక్​ మాజీ కెప్టెన్​​కు గుండెపోటు

పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​ ఇంజమామ్​-ఉల్​-హక్​.. సోమవారం గుండెపోటుకు(Inzamam Heart Attack) గురయ్యాడు. ఛాతీనొప్పితో మూడురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఇంజమామ్​.. తాజాగా గుండెపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇంజమామ్​కు(Inzamam News) యాంజియోప్లాస్టీ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.

08:48 September 28

టాప్​న్యూస్​@9AM

  • రీఛార్జిలో సాంకే‘తికమక’! 

హైదరాబాద్ మెట్రోరైల్ టిక్కెటింగ్​లో సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఆన్​లైన్​లో రీఛార్జ్ చేసుకున్న వారికి కార్డులో నగదు జమ కావడం లేదు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నాఅధికారులు పట్టించుకోవడం లేదు.

  • రాష్ట్రవ్యాప్తంగా సెలవు

గులాబ్​ తుపాను(Gulab Cyclone Effect) ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా సెలవు(holiday for government and private offices) ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు కారణంగా ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. వర్షాల కారణంగా సెలవు నుంచి అత్యవసర శాఖలకు మినహాయింపు ఇచ్చారు.

  • గాడిన పడని 'సహకారం'

దేశంలో సహకార వ్యవస్థ(Cooperative Policy) క్రమేణా అసలు లక్ష్యానికి దూరమవుతోంది. పూర్తిగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులే దీన్ని శాసించే పరిస్థితులు దాపురించాయి. 'ఒక్కరి కోసం అందరూ.. అందరి కోసం ఒక్కరు' అనే నినాదంతో స్థాపించిన ఈ వ్యవస్థ అంతకంతకు సన్న, చిన్నకారు రైతాంగానికి అక్కరకు రాకుండా పోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులేస్తోంది.

  • దిల్లీ ఆవిరి చేయనుందా?

ఐపీఎల్​లో(IPL 2021) ఇప్పటికే ప్లేఆఫ్స్​కు అడుగుదూరంలో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టు కోల్​కతా నైట్​రైడర్స్​తో(DC Vs KKR) జరగనున్న మ్యాచ్​లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మ్యాచ్​లో గెలుపొంది ప్లేఆఫ్స్(IPL Playoffs 2021)​ బెర్తును ఖరారు చేసుకోవాలని పంత్​ సేన యోచిస్తుండగా.. ఇందులో విజయం సాధించి ప్లేఆఫ్​ ఆశలను సజీవం చేసుకోవాలని మోర్గాన్​ సేన సన్నద్ధమవుతోంది.

  • 14 ఏళ్ల నట ప్రస్థానం

మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్(Ram Charan Movies).. తెలుగు తెరకు పరిచయమై నేటికి 14 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్న శైలిలో చాటుకున్నారు మెగా ఫ్యాన్స్. హైదరాబాద్​లోని నెక్లెస్‌ రోడ్డు సమీపంలో రామ్‌ చరణ్‌(Ram Charan Movies List) బొమ్మని గీసి, దానికి రంగులు వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

07:48 September 28

టాప్​న్యూస్​@8AM

  • తెలంగాణ అతలాకుతలం

గులాబ్ తుపాను తెలంగాణను అతలాకుతలం చేసింది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాల(Heavy Rain in Telangana)తో వరదలు ముంచెత్తాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  

  • డీఎస్​కు నాలుగైదు రోజుల్లో శస్త్ర చికిత్స

నాలుగైదు రోజుల్లో భుజానికి శస్త్ర చికిత్స చేస్తామని... రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri srinivas)​కు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం పూజ గది నుంచి బయటకు వస్తుండగా ఆయన కింద పడిపోవడంతో భుజానికి ఫ్రాక్చర్ అయింది.

  • 'దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలి'

సమాచార, సైబర్‌ స్పేస్‌ వంటి అంశాల్లో సాయుధ బలగాలు పైచేయి సాధించాల్సిన అవసరం ఉందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu News). సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని చెప్పారు.

  • డిజిటల్‌ గుర్తింపు సాధ్యమేనా?

పేద, మధ్య తరగతి ప్రజల వైద్య చికిత్సల్లో ఎదురయ్యే సమస్యల్ని తొలగించడానికి డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే ఎన్​డీహెచ్​ఎంను అమలు చేయడంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు భావిస్తున్నారు.

  • లతా మంగేష్కర్.. జీవన గీతాసారం

సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్​(Lata Mangeshkar Birthday).. 36 ప్రాంతీయ భాషలు, కొన్ని విదేశీ భాషల్లో కలిపి 27వేల చలన చిత్ర గీతాలను(Lata Mangeshkar Old Songs) ఆమె ఆలపించారు. మంగళవారం(సెప్టెంబరు 28) లతాజీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

06:45 September 28

టాప్​న్యూస్​@7AM

  • మూడో స్థానంలో తెలంగాణ

వ్యవసాయరంగ పురోగతిలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో, ఏపీ నాలుగో స్థానంలో ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ వెల్లడించారు. రైతు ఆదాయంలో పంటల వాటా 2011-12లో 65.4% మేర ఉండగా... 2018-19 నాటికి అది 55.3%కి పడిపోయిందని వెల్లడించారు.

  • మరో 4 కాలేజీలకు గ్రీన్​సిగ్నల్

తెలంగాణలో కొత్తగా మరో నాలుగు ప్రైవేట్ వైద్య కళాశాలలు(Private Medical Colleges in Telangana) ఏర్పాటకు రంగం సిద్ధమైంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుమతి ఇచ్చింది. 

  • క్షీణిస్తున్న నీటిలభ్యత

దేశంలో నదీజలాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఉపఖండంలోని సింధు, గంగ, యమున వంటి నదులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తగిన జలవనరులు అందుబాటులో లేకుంటే భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • రామోజీ గ్రూప్‌ సంస్థలకు అవార్డులు

రామోజీ గ్రూపు సంస్థలకు (ramoji film city) రాష్ట్ర పర్యాటక శాఖ రెండు పురస్కారాలు అందజేసింది. సెప్టెంబరు 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో పురస్కారాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ప్రదానం చేశారు.

  • డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ

వర్షాలతో ఆ గ్రామంలో రవాణా స్తంభించింది. అయితే ఓ పిల్లాడికి తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో విలవిలాడిపోయాడు. దీనితో ఆ గ్రామస్థులు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్ల వినూత్న ఆలోచనతో ఆ పిల్లాడి ప్రాణాలు నిలిచాయి. 

04:50 September 28

టాప్​న్యూస్​@6AM

  • అతలాకుతలం చేసిన గులాబ్

గులాబ్‌ తుపాను ప్రభావం(Gulab Effect)తో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులు చెరువుల్లా మారడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • సెలవు ప్రకటించిన ప్రభుత్వం

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇవాళ సెలవు ప్రకటించారు. గులాబ్‌ తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై సీఎం కేసీఆర్​... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​తో సమీక్షించారు.

  • సమావేశాలకు విరామం

గులాబ్ తుపాను (Gulab Cyclone) ఎఫెక్ట్ శాసనసభ, మండలి సమావేశాలపై పడింది. సమావేశాలకు మూడురోజులు పాటు శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ విరామం (Assembly Pause) ప్రకటించారు. అనంతరం వచ్చేనెల 1న తిరిగి సమావేశం కానున్నాయి.

  • కేంద్రానికి మరోసారి సీఎం విజ్ఞప్తి

రాష్ట్రంలో పండే ధాన్యం మొత్తం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr On Paddy).. కేంద్రప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. మరోసారి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal)ను కలిసిన కేసీఆర్‌.. ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని వివరించారు.

  • మూల్యం చెల్లించక తప్పదు

పార్టీలతో అంట కాగిన అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్ వీ రమణ(Justice NV Ramana News) వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు గుంజుకొనే పోలీసు అధికారులు.. ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు.

  • ఒడిశా గజగజ

గులాబ్ తుపాను ధాటికి (Gulab Cyclone updates) ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో వీచిన ఈదురు గాలులకు అనేక చెట్లు నేల కూలాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

  • వణుకుతున్న ఏపీ

గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • డోసు తీసుకున్న బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌధంలో కొవిడ్ బూస్టర్ డోసు(Biden Booster) తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన(Biden News).. అర్హత ఉన్నవారు బూస్టర్ డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

  • సన్​రైజర్స్​ విక్టరీ

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

  • బిగ్​బీ ఆటోగ్రాఫ్​ కోసం జాకీష్రాఫ్

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​తో(amitabh jackie shroff) తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మరో బీటౌన్​ నటుడు జాకీ ష్రాఫ్​. గతంలో ఆటోగ్రాఫ్​ కోసం బిగ్​బీ దగ్గరకు వెళ్తే అభిషేక్​, శ్వేతా బచ్చన్​ తనకు షాక్​ ఇచ్చారని వెల్లడించారు.

Last Updated : Sep 28, 2021, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details