గగన విషాదంలో పెరుగుతున్న మృతులు
పాకిస్థాన్ విమాన ప్రమాదం ఘటనలో ఇప్పటివరకు 97 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. మొత్తం 99 మందితో లాహోర్ నుంచి కరాచీ బయలుదేరిన పీకే-8303 విమానం... ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందు కూలి పోయింది. అయితే ఆ మృతదేహాలు ప్రయాణికులవేనా?
కరోనా రికార్డ్
దేశంలో కరోనా క్రమంగా వేగం పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 137 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. మరిన్ని వివరాలు.
కరోనా పంజా
జీహెచ్‌ఎంసీపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. 14 రోజుల వ్యవధిలోనే ఇక్కడ 500 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో 62 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించగా, 42 జీహెచ్‌ఎంసీ పరిధిలోవే కావడం గమనార్హం. లాక్డౌన్ సడలింపులే కారణమా?
అంతుచిక్కని ప్రశ్నలు
వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని బావిలో 9 మృతదేహాల కేసు పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇవి హత్యలా? ఆత్మహత్యలా?..ఈ దారుణాలకు వివాహేతర సంబంధమేమైనా కారణమా..?? ఇంతకీ గొర్రెకుంట గుట్టు ఏంటీ..?
నేడే ప్రకటన
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విధించిన లాక్డౌన్ వల్ల విద్యార్థుల పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ నియంత్రణలోకి రావడం వల్ల రాష్ట్ర విద్యాశాఖ ఎంసెట్, ఈసెట్ పరీక్షలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. పరీక్షా తేదీలను నేడు ప్రకటించనుంది.