తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 6:53 PM IST

ETV Bharat / state

టాప్‌టెన్‌ న్యూస్‌ @7pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @7pm
టాప్‌టెన్‌ న్యూస్‌ @7pm

1. ఇప్పుడు గుర్తొచ్చారా..?

కాంగ్రెస్​ తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకువస్తారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం సీట్లు అని కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అభినందనలు

భాగ్యనగరంలో తన నూతన ఎక్స్​పీరియన్స్​ స్టోర్​ను స్మార్​ ఫోన్​ దిగ్గజ సంస్థ వన్​ ప్లస్​ ఆవిష్కరించింది. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టోర్​.. తమకు ప్రపంచంలోనే అతిపెద్దదని కంపెనీ ప్రకటించింది. ఈ స్టోర్​ను హైదరాబాద్​కు తీసుకువచ్చినందుకు మంత్రి కేటీఆర్​ వన్​ ప్లస్​ టీంను అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆ పది పాఠశాలలపై చర్యలు

కరోనా పరిస్థితుల్లో ఫీజులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను హైదరాబాద్​లోని పది ప్రైవేట్ పాఠశాలలు ఉల్లంఘించాయని పాఠశాల విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులకు నివేదిక ఇస్తామని పేర్కొంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. చూస్తూ ఊరుకోం..

రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తే... ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈనెల 18వ తేదీలోగా బకాయిలను రైతులకు చెల్లించాలని.. ట్రైడెంట్ కర్మాగారాన్ని మంత్రి ఆదేశించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఫిబ్రవరిలోనే కొవాగ్జిన్‌

భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్​ అనుకున్న సమయానికన్నా ముందే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్​ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు ఐసీఎంఆర్​ సీనియర్​ శాస్త్రవేత్త రజనీకాంత్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మైకులు మూగబోయాయి

బిహార్​ మూడో దశ పోలింగ్​ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. నవంబర్​ 7న 19 జిల్లాల్లోని 78 స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. అసెంబ్లీ స్పీకర్​ విజయ్​ కుమార్​ చౌదరి సహా పలువురు మంత్రులు, కీలక నేతలు బరిలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కరోనా వేళ అక్కడ ఉండొచ్చా..?

కరోనా వేళ హోటళ్లలో ఉండటం సురక్షితమేనా? అన్న ప్రశ్నకు అమెరికా సీడీసీ ఓ అప్​డేట్​ విడుదల చేసింది. కరోనా బారినపడకుండా ఉండాలంటే.. ఇళ్లలో ఉండటమే మేలు అని పేర్కొంది. పర్యటించాల్సి వచ్చిన సందర్భాల్లో తక్కువ మంది ఉండే హోటల్​ను చూసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బుల్​ జోరు

స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజూ బుల్​ జోరు కొనసాగింది. గురువారం సెషన్​లో సెన్సెక్స్ భారీగా 724 పాయింట్లు పెరిగి 41 వేల మార్క్​ పైకి చేరింది. నిఫ్టీ కూడా 212 పాయింట్లు పుంజుకుని 12 వేలపైన స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. స్వల్ప స్కోర్లు

మహిళా టీ20 ఛాలెంజ్​లో జరిగిన రెండో మ్యాచ్​లో ట్రైల్​బ్లేజర్స్​పై వెలాసిటీ విజయం సాధించింది. ఈ పోరులో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అందులో నిజం లేదు

మెగా హీరోతో లవ్​ట్రాక్​ నడుపుతుందన్న వార్తల్లో నిజం లేదని చెప్పిన రాశీఖన్నా.. అవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. పరిశ్రమలో తనకు ఎంతోమంది ఫ్రెండ్స్​ ఉన్నారని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details