తెలంగాణ

telangana

ETV Bharat / state

Latest Telangana News టాప్​న్యూస్​ 7AM - Telangana News

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Latest Telangana News
టాప్​న్యూస్​ 7AM

By

Published : Aug 18, 2022, 6:59 AM IST

  • ఏ మాత్రం మోసపోయినా గోసపడతాం

దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దాదాపు 12 రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణలో బతుకుతున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ బహిరంగసభలో మాట్లాడారు.

  • మోదీ అంగీకారంతోనే విడుదల చేశారా

గుజరాత్ బిల్కిస్ బానో అత్యాచార కేసులోని దోషులను విడుదల చేయడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అటువంటి వారిని విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ స్పందించారు. నారీ శక్తి గురించి మాట్లాడిన మోదీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.

  • కాంగ్రెస్‌లో మరో అసమ్మతి స్వరం

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చాలా బాధకలిగించేవిగా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్‌ చేతిలో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్టు లేదని.. ఠాగూరే.. రేవంత్‌ చేతిలో పనిచేస్తున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

  • కుమార్తె ప్రియుడి పురుషాంగం కోసేసిన మహిళ

కుమార్తెతో సంబంధం పెట్టుకొనేందుకు ప్రయత్నించిన ప్రియుడి పురుషాంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ ఘటన యూపీలో జరిగింది. మరోవైపు, రాజస్థాన్​లో మైనర్​పై పలువురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

  • మంత్రి కొప్పులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

మంత్రి కొప్పుల ఈశ్వర్​కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. మంత్రి కొప్పుల వేసిన పిటిషన్​ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల అవకతవకలపై హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పిటిషన్‌ వేశారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని లక్ష్మణ్​కుమార్​ అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పిటిషన్ కొట్టివేయాలని మంత్రి కొప్పుల హైకోర్టు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

  • మీ పిల్లల ఆర్థిక భవిష్యత్​కు ఫుల్ సేఫ్టీ

పిల్ల‌ల భ‌విష్య‌త్‌కు డ‌బ్బులు పొదుపు చేయడం అంటే వాళ్ల‌ కోసం ఆస్తులు పోగు చేయడమే కాదు.. వారి చ‌దువుల‌కు, వివాహానికి కూడా స‌రిప‌డా ఆదా చేయ‌డం. పిల్ల‌ల విద్య‌కు స‌రిప‌డినంత మొత్తం సమయానికి అందేలా ఏర్పాటు చేసుకోవాలి. త‌ల్లిదండ్రులు స్ప‌ష్ట‌మైన ఆర్థిక ల‌క్ష్యాల‌ను క‌లిగి ఉండాలి. విద్యా నిధికి వ్యూహాత్మ‌క పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయాలి.

  • భారత్, చైనా సంయుక్త సైనిక విన్యాసాలు

భారత్, చైనా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత సమయంలో ఇరుదేశాలు కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయా అంటే డ్రాగన్ అవుననే అంటోంది. ఇరుదేశాలు సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొననున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

  • జింబాబ్వేతో వన్డే సిరీస్​కు టీమ్​ఇండియా రెడీ

కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించి జింబాబ్వే మంచి ఊపు మీదుంది. ఈ క్రమంలో భారత్‌, జింబాబ్వే జట్ల బలాలు.. ఇప్పటి వరకు ఇరు జట్లు ఆడిన సిరీస్‌లు.. ఆధిక్యం ఎవరనే విషయాలను తెలుసుకుందాం..

  • ఆస్కార్​ రేసులో నాని, సాయిపల్లవి సినిమా

Shyamsingha roy Oscar nominations నేచురల్​స్టార్​ నాని, సాయిపల్లవి నటించిన శ్యామ్​సింగరాయ్​ సినిమాకు అరుదైన గౌరవం దక్కే అవకాశం లభించింది. ఈ మూవీ మూడు విభాగాల్లో ఆస్కార్​ నామినేషన్​ రేసులో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

  • విజయ్​దేవరకొండ లైగర్​ కొత్త ప్రోమో

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌మూవీ 'లైగర్‌'. అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్‌, పూరిలను ఛార్మి స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అభిమానులు నుంచి వచ్చిన అనేక ప్రశ్నలను ఛార్మి అడిగారు.

ABOUT THE AUTHOR

...view details