- కూలీలపై పడిన పిడుగు, నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. నలుగురి మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ ఆస్తులు ఎంతో తెలుసా
Kishan Reddy Family Assets కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన వ్యక్తిగత, కుటుంబ ఆస్తులు, అప్పులను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించారు. కిషన్ రెడ్డి కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ.22.54 కోట్లుగా, అప్పులు రూ.1.59 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి కుటుంబ ఆస్తుల విలువ రూ.4.34 కోట్ల మేర పెరగగా, అప్పులు రూ.7 లక్షల మేర తగ్గాయి.
- పిల్లలో ఒత్తిడి తగ్గిస్తే జంక్‌ఫుడ్‌కి దూరం అవుతారట
పిల్లల్లో ఒత్తిడికి వారు తినే ఆహారానికి అవినాభావ సంబంధం ఉందని, ఎక్కువ ఒత్తిళ్లు ఎదుర్కొనే చిన్నారులు జంక్‌ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేవియర్‌లో ముద్రితమైన ఈ అధ్యయనం ప్రకారం ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో పిల్లలు తీసుకునే ఆహార పదార్థాల్లో 40 శాతం వరకూ స్వీట్లు, పేస్ట్రీ కేకులు ఉంటున్నాయి.
- అంకాపూర్ నాటుకోడి కూర, అమెరికా చేరి
ankapur desi chicken చుట్టూ పచ్చని పంటచేలు.. నగరాన్ని తలపించేలా అందమైన భవనాలతో కొలువుదీరిన అంకాపూర్ వ్యవసాయంలో ఎంత పేరు తెచ్చుకుందో అదే స్థాయిలో నాటుకోడి కూరను వండటంలో పేరుగాంచింది. ఇతర చోట్ల ఎక్కడ తిన్నా ఈ రుచి రాదు. మరి అంకాపూర్ నాటుకోడి స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి.
- కాంగ్రెస్‌కు అజాద్ షాక్, పార్టీ ఆఫర్ తిరస్కరణ
Ghulam nabi azad news కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ అజాద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను గులాంనబీ ఆజాద్ తిరస్కరించారు. ఆజాద్ సన్నిహితుడైన వికార్ రసూల్ వానీని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. అయితే నియమించిన కొద్ది సేపటికే ఆఫర్‌ను ఆజాద్ తిరస్కరించారు.
- ఘోర రైలు ప్రమాదం, 53 మందికి గాయాలు