తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్​ 7AM - ETV bharat telangana top news

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana News Today
టాప్​న్యూస్​ 7AM

By

Published : Aug 17, 2022, 6:59 AM IST

  • తెలంగాణకు ప్రధానే శత్రువు

CM KCR on BJP తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి చేసిందా అని ప్రశ్నించారు. వికారాబాద్​ జిల్లాకేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనం​ ప్రారంభించిన సీఎం బహిరంగ సభలో కేంద్రం తీరుపై విమర్శలు సంధించారు.

  • మరోమారు దేశభక్తిని చాటుకున్న ప్రజానీకం

Mass singing of national anthem స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందడిగా సాగింది. ఉదయం పదకొండున్నర గంటలకు ఎక్కడి వారు అక్కడే నిల్చొని.. జాతీయ గీతం ఆలపించారు. ప్రజలందరూ జనగణమన పాడి.. దేశభక్తిని మరోసారి చాటారు.

  • మూడేళ్ల చిన్నారిపై దారుణం

బిహార్​లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మైనర్. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బర్త్​డే పార్టీకి హాజరైన మహిళకు కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

  • ఎన్నికలొచ్చినా భాజపాదే గెలుపు

Kishan Reddy Comments on KCR సీఎం కేసీఆర్​తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీపై ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • ఆకాశంలో త్రివర్ణం రెపరెపలు

ఆకాశంలో జాతీయ జెండాను రెపరెపలాడించింది ఓ పక్షి. త్రివర్ణ పతాకంతో గాల్లోకి ఎగిరింది. రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​లో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న రాణాప్రతాప్ సాగర్ డ్యామ్​పై అధికారులు త్రివర్ణ పతాకాలు ఏర్పాటు చేశారు. కాగా, ఓ గద్ద డ్యామ్​పై వచ్చి వాలింది. పైకి ఎగిరే క్రమంలో అక్కడ ఉన్న ఓ జెండా గద్ద కాళ్లకు చిక్కుకుంది. పక్షి అలాగే ఎగిరేసరికి కింద ఉన్నవారికి గద్ద జెండాను పట్టుకొని గాల్లో చక్కర్లు కొడుతునట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆగస్టు 14న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

  • సుప్రీం కీలక వ్యాఖ్యలు

తలాక్ విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలకు ఒకసారి చొప్పున వరుసగా మూడు నెలలు చెప్పే తలాక్- ఈ- హసన్​.. ముమ్మారు తలాక్ వేర్వేరు అని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు ఖులా ద్వారా భర్త నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది.

  • ఉద్యోగులకు యాపిల్​​ షాక్​

కరోనా తర్వాత ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే నియామకాలను నిలిపివేసిన దిగ్గజ సంస్థలు ఉద్యోగాల్లో కూడా కోతలు పెడుతున్నాయి. 100 మంది ఒప్పంద రిక్రూటర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు యాపిల్​ కంపెనీ తెలిపింది. మరో దిగ్గజ సంస్థ గూగుల్‌ కూడా త్వరలోనే ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది

  • ఆసియా కప్​లో మునుపటి కోహ్లీని చూస్తాం

టీమ్​ఇండియా బ్యాటర్​ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మద్దతుగా నిలిచారు. వచ్చే ఆసియా కప్​లో మునుపటి కోహ్లీని చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు బౌలర్​ దీపక్ చాహర్ పునరాగమనంపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ మణిందర్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాహర్ చాలా టాలెంటెడ్ ఆటగాడని అన్నారు మణిందర్.

  • ఎన్టీఆర్​ దైవాంశ సంభూతుడు, ఇవే సాక్ష్యాలు

ఇష్టదైవాలు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. శతాబ్దాల శిల్పాలో, రాజా రవివర్మ గీసిన చిత్రాల్లోనో దేవుళ్లు ఇలా ఉంటారని పోల్చుకుంటాం. కానీ అశేష ప్రేక్షకలోకం శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి ఎన్టీ రామారావులోనే చూసుకుందనేది నూరుశాతం నిజం. అనేక పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రామారావు, అచ్చం ఆ పాత్రలకోసమే పుట్టి వుంటారని చాలా మంది అంటారు. అయితే సీనియర్ ఎన్టీఆర్​తో 'ఎదురు లేని మనిషి', 'యుగపురుషుడు' వంటి హిట్​ సినిమాలు చేసిన నిర్మాత అశ్వనీదత్​.. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' చిత్రీకరణ సమయంలో నటసార్వభౌముడితో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. అదేంటంటే..

  • ఆ విషయంలో దిల్​రాజు వివరణ

కార్తికేయ-2 విడుదల విషయంలో తనపై జరిగిన ప్రచారంపై నిర్మాత దిల్​రాజు వివరణ ఇచ్చారు. సినిమాలను ఎవరు తొక్కాలని చూడరని అన్నారు. అవాస్తవాలు రాసే ముందు నిజాలు తెలుసుకుని రాయండి అని చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details