తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్​ 7AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

By

Published : Aug 16, 2022, 6:58 AM IST

Telangana News Today
Telangana News Today

  • భారతావని ప్రగతికి ప్రధాని మోదీ పంచ ప్రాణ ప్రతిష్ఠ

స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారతావని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి స్వయంసమృద్ధ దేశంగా అవతరించాల్సిందనేని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చిచెప్పారు. దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే కొనసాగుతున్న భారత్‌ను.. పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరింపజేద్దామంటూ పిలుపునిచ్చారు. అందుకోసం పంచ ప్రాణమంత్రాన్ని ఉపదేశించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి భూతాన్ని తరిమేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించేలా.. ఆధునిక ప్రపంచంలో ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా ‘జై అనుసంధాన్‌’ అంటూ కొత్త నినాదమిచ్చారు.

  • మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా

వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ తీసుకురానున్నట్లు సీరం ఇన్​స్టిట్యూట్ సీఈఓ అదర్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణమని నివేదికలు వస్తోన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

కర్ణాటకలోని బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బీదర్ జిల్లా బంగూర్ వద్ద హైవేపై కంటైనర్‌ను వెనకనుంచి ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతులంతా హైదరాబాద్ నాగోల్ వాసులని, ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. కలబురిగి జిల్లా గాన్గాపూర్‌కు కారులో దత్తాత్రేయ ఆలయ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

  • రాజ్​భవన్​లో ఎట్ హోమ్ కార్యక్రమం, హాజరు కాని సీఎం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్​భవన్​లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, తెరాస నేతలు ఎవరూ హాజరుకాలేదు.

  • కొత్త వారికి పింఛన్ల పంపిణీ షురూ

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితోపాటు పెండింగ్‌లో ఉన్నపింఛన్ల దరఖాస్తులను కూడా పరిష్కరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి పీడీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి.

  • రష్దీపై దాడికి వారే కారణం, ఎట్టకేలకు నోరు విప్పిన ఇరాన్​

ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి వెనుక ఇరాన్‌ పాత్ర ఉందన్న ఆరోపణలను ఆ దేశం కొట్టిపారేసింది. ఈ వ్యవహారంపై తొలిసారి అధికారికంగా స్పందించిన ఇరాన్‌.. ఈ దాడి విషయంలో తమపై ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. రష్దీ, ఆయన మద్దతుదారులే దానికి కారణమని టెహ్రాన్‌లోని విదేశాంగశాఖ సోమవారం పేర్కొంది. 1988లో రష్దీ నవల 'ది సాతానిక్‌ వెర్సెస్‌‌' తీవ్ర వివాదాలకు దారితీసింది. ఆయన్ను చంపేయాలంటూ అప్పట్లో ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా రుహొల్లా ఖొమేనీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దాడి వెనుక ఇరాన్‌ హస్తంపై ఆరోపణలు వచ్చాయి.

  • గర్ల్​ఫ్రెండ్​తో చాటింగ్, ఆరు గంటలు ఆగిపోయిన విమానం

ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సరదాగా జరిగిన చాటింగ్ ఏకంగా ఆరు గంటలపాటు ఓ విమానాన్ని నిలిపివేసింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగింది. అసలేం జరిగిందంటే

  • ఎస్​బీఐ రుణాలు ఇక మరింత భారం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.

  • ఆసియా కప్​లో తిరుగులేని రోహిత్​ శర్మ

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్​ఇండియా జోరు కొనసాగుతోంది. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. త్వరలో జరగబోయే ఆసియా కప్​కు సన్నద్ధమవుతోంది. అయితే ఈ మెగాటోర్నీలో భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్​ శర్మకు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఓ సారి అవేంటో చూద్దాం.

  • ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇచ్చేశా

"మంచి కథా బలమున్న చిత్రం 'లైగర్‌'. ఇది శారీరకంగా, మానసికంగా నాకు సవాల్‌ విసిరింది" అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా ఇది. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details