ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలువంట గ్యాస్ ధర తగ్గింపు.. ఎంతంటే... LPG price cut news: వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నుంచి రూ.36 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా దిల్లీలో ఇప్పటివరకు రూ.2,012.50గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1,976కు చేరింది.ఒక్కరికే మళ్లీ మళ్లీ వస్తున్న కరోనాఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. అయితే ఆయనకు నాలుగు రోజుల్లోనే నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి జో బైడెన్‌కు చికిత్స అందించడంలో ఉపయోగించిన 'పాక్స్‌లవిడ్' అనే ఔషధంపైకి మళ్లింది. కొవిడ్ తీవ్రతను వేగంగా తగ్గించే ఈ డ్రగ్.. కొన్నిసార్లు వ్యాధి పునరాగమనానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఆ ఔషధం గురించి ఓ సారి తెలుసుకుందాం.రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత కుమార్తె మృతి శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సీఎం సమావేశంతెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ భేటీలో వజ్రోత్సవాల కోసం ఏర్పాటు చేసిన కమిటీతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఉత్సవాల కార్యాచరణ, విధి విధానాలపై చర్చించనున్నారు.రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు రాష్ట్రంలో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.కరెంట్ షాక్‌తో 10 మంది మృతికరెంట్ షాక్ తగిలి వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్ కూచ్ బెహార్లో జరిగింది. వ్యాన్ వెనుక భాగంలో ఉన్న డీజే సిస్టమ్ జనరేటర్ వైరింగ్‌లో సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమని తెలిసింది.ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. ఉగ్రవాది ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించి, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అక్సెల్ అనే శునకానికి ఆర్మీ నివాళి అర్పించింది. ఓ మసీదుకు ముప్పు కలగకుండా నివారించిన 'ఆర్మీ 26 డాగ్ యూనిట్'కు చెందిన ఆ రెండేళ్ల శునకానికి బాధాతప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించింది.తల్లి పాలు.. బిడ్డకు అందే తొలి వ్యాక్సిన్!బిడ్డకు అందే తొలి వ్యాక్సిన్.. అమ్మ పాలే! చిన్నారిని చిరంజీవిని చేసే ఈ అమృతం అందకే ఏటా లక్షలమంది పిల్లలు మరణిస్తున్నారు. అయితే.. బిడ్డకు పాలివ్వాలనే సంకల్పం తల్లికి మాత్రమే ఉంటే సరిపోతుందా? కాదు.. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, సమాజం కూడా ఈ విషయంలో తల్లికి అండగా నిలవాలి. ఎందుకంటే..కామన్వెల్త్లో భారత్ జోరు.. కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకుంది భారత్. ఆ మూడు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చినవే. తొలి స్వర్ణాన్ని మీరాబాయి చాను అందించగా.. రెండోది జెరెమీ.. మూడోది అచింత అందించాడు. మరోవైపు, భారత మహిళల క్రికెట్లో అమ్మాయిలు పాక్‌ను చిత్తు చేసి సెమీస్ ఆశలు సజీవం చేసుకున్నారు.'కశ్మీరీ సింగర్' పాత్రలో కంగనా.. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు మధుర్.. ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో కంగనా ఓ కశ్మీరీ గాయకురాలి పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు, 'అగ్నినక్షత్రం' సినిమాలో ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రలో మోహన్‌బాబు సందడి చేయనున్నారు.