తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ న్యూస్​ 7PM - ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Etv Bharat Telangana news
టాప్​ న్యూస్​ 7PM

By

Published : Aug 13, 2022, 6:58 PM IST

  • ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ పత్రిక ప్రకటన చేశారు. పేదల సంక్షేమ పథకాలపై మోదీకి ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. అసలు తమ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి అని మండిపడ్డారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా? అని విరుచుకుపడ్డారు.

  • కాల్పుల ఘటనపై మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఏమన్నారంటే

Minister Srinivas goud firing: మహబూబ్‌నగర్‌ ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపటం కలకలంరేపింది. జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌ టవర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ర్యాలీ ప్రారంభ సమయంలో తుపాకీతో గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి కాల్పులు జరపటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

  • రాఖీ రోజే అక్కను ఆమె ప్రియుడ్ని చంపిన తమ్ముడు

Honor Killing: అక్కకు రక్షగా ఉండాల్సిన తమ్ముడే.. ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని కూడా హతమార్చాడు. రాఖీ పండగ రోజే ఈ అమానవీయ ఘటన జరగడం కలచివేస్తోంది. మహారాష్ట్ర జల్​గావ్​లో శుక్రవారం రాత్రి ఈ పరువు హత్య కలకలం రేపింది. మైనర్​ అయిన నిందితుడు హత్య అనంతరం పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు.

  • కాంగ్రెస్​ హోంగార్డునంటూ ట్విటర్​ ప్రొఫైల్​ మార్చేసిన కోమటిరెడ్డి

గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు​ వార్తల్లో హాట్​టాపిక్​గా మారిపోయాయి. రాజీనామాతో తమ్ముడు రాజ్​గోపాల్​రెడ్డి సంచలనంగా మారితే, పీసీసీ తీరుపై తనదైన శైలి కామెంట్లతో అసహనం వ్యక్తం చేస్తూ వెంకట్​రెడ్డి కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆయనపై సొంత పార్టీ నేతలు చేసిన విమర్శలు, అనుచిత వ్యాఖ్యలను చాలా సీరియస్​గా తీసుకున్న వెంకట్​రెడ్డి, ఎంత హర్ట్​ అయ్యారన్న విషయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.

  • జాతీయ జెండా ఆకృతిలో వేలాది విద్యార్థులు

పంజాబ్​ చండీగఢ్‌లోని ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో నిల్చొని గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్ నెలకొల్పారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల దుస్తులు ధరించిన విద్యార్థులు జాతీయజెండా మాదిరిగా మైదానంలో నిల్చున్నారు. ఈ ప్రదర్శనలో 5,885 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటివరకు యూఏఈ పేరుపై ఉన్న రికార్డును చండీగఢ్‌ విద్యార్థులు అధిగమించారు.

  • టీమ్​ఇండియాకు సవాల్​ విసిరిన ఆ దేశ క్రికెట్​ కోచ్

IND VS ZIM: దాదాపు ఆరేళ్ల తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడేందుకు టీమ్‌ఇండియా హరారేకి బయల్దేరి వెళ్లింది. కేఎల్‌ రాహుల్ నాయకత్వంలోని భారత్‌ ఆగస్ట్‌ 18న తొలి వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ఆగస్టు 20, ఆగస్టు 22న మ్యాచ్‌లను ఆడనుంది. తాజాగా బంగ్లాదేశ్‌ వంటి జట్టును ఓడించిన జింబాబ్వే.. భారత్‌కు సవాల్ విసిరడం గమనార్హం. తమ జట్టుతో టీమ్‌ఇండియా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు జింబాబ్వే ప్రధాన కోచ్‌ డేవ్ హౌటన్.

  • లంచం ఇస్తేనే ఉద్యోగాలంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే యువకులు లంచం ఇవ్వాలని విమర్శించారు. యువతులైతే మరో రకంగా ప్రభుత్వానికి సహకరించాలని భాజపాపై విరుచుకుపడ్డారు. ప్రియాంక్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శలు ఎక్కుపెట్టింది. ఇలాంటి విమర్శలు చేసే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని భాజపా పేర్కొంది.

  • బింబిసార మూవీ చూసిన బాలయ్య

జయాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్య‌భ‌రితంగా ముందుకు తీసుకెళ్తున్నారు నందమూరి హీరో క‌ల్యాణ్ రామ్‌. ఈ క్ర‌మంలోనే ఇటీవల 'బింబిసార'గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం.. గత శుక్రవారం(ఆగస్టు 5) విడుదలై హిట్​టాక్​తో దూసుకుపోతోంది.

  • ఇళ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన సినీ నటులు

దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ఊపందుకుంది. పలువురు సినీ ప్రముఖులు తమ నివాసాల వద్ద జాతీయ జెండాలను ఏర్పాటు చేసి హర్​ ఘర్​ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నటులు మోహన్​లాల్​, ఆమిర్​ ఖాన్​, ముమ్ముట్టి, అనుపమ్​ ఖేర్​ తదితరులు త్రివర్ణ పతాకాల్ని ఎగురవేశారు.

  • ప్రభాస్​ స‌లార్ అప్డేట్​ మ‌రో రెండు రోజుల్లో

Prabhas Salaar Update: 'కేజీఎఫ్'​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​- రెబల్​స్టార్​ ప్రభాస్​ కాంబినేషన్​లో వస్తున్న 'సలార్'​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించి.. చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్​ రాలేదు. ఈ విష‌యంలో డార్లింగ్ అభిమానులు మేక‌ర్స్‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్​ను మేకర్స్​ ప్ర‌క‌టించారు.

ABOUT THE AUTHOR

...view details