- ఆర్టీసీ ఎండీగా ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు?
ఆర్టీసీలో నా మొదటి ప్రాధాన్యత స్వావలంబన. సంస్థ నష్టాల్లో ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు ఆదుకుంది. ఇకపై ఆర్టీసీకి అవసరమైన కనీస నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా.. తామే సమకూర్చుకోవడంపై దృష్టి సారిస్తాం. ప్రయాణికుల సంఖ్యను ఎలా పెంచాలి..? ఆదాయం ఎలా తీసుకురావాలి..? అనే అంశాలపై దృష్టిపెడతాం.
- ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు జీతం కోసం ఎదురుచూడకుండా ఉండేందుకు మీరు ఎలాంటి హామీనిస్తారు?
ఏ సంస్థ అయినా నష్టాల్లో ఉన్నప్పుడు జీతాలకు కచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఈ సమస్య కేవలం ఒక్క ఆర్టీసీది మాత్రమే కాదు.. బయట చాలా సంస్థలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. కొన్ని సంస్థల్లో నెలల తరబడి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. కానీ.. ఇక్కడ అలా కాదు.. ప్రభుత్వం ఆదుకుంటుంది. జీతాలు కొంత ఆలస్యమైనా వస్తున్నాయి. ఎందుకు మనమే నిలదొక్కుకోకూడదు అనే ఆలోచన చేస్తే.. అలా జీతాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.
- ప్రయాణికులను సంస్థకు దగ్గర చేసేందుకు ఆర్టీసీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ఆలోచన ఏమైనా ఉందా..?
సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అధికారులు ఇప్పటికే కొంత పని చేశారు. నేను సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశంపై పనిచేసి వచ్చాను. ఇప్పటికే ఆర్టీసీలో ఈ-సిస్టం ఉంది. ఖమ్మంలో ప్రయోగాత్మకంగా పని చేశాం. ఆ ఫలితాలు చూసి.. కచ్చితంగా ఇక్కడ కూడా వాటిని అమలు చేస్తాం. పాశ్చాత్య దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏ సమయంలో బస్సు వెళుతుంది తదితర వివరాలు తెలియజేస్తారు. అలాంటి వ్యవస్థ ఇక్కడ ప్రవేశపెట్టేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.
- మహిళా ఉద్యోగులపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు?
డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నాయి, మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తదితర అంశాలపై ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం.
- 'ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారు.. అందుకే ఎండీగా సజ్జనార్‌ను తీసుకొచ్చారు' అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?