తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీలో సాధారణసేవలు ప్రారంభం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

నేటి నుంచి గాంధీలో కొవిడ్ సేవలతో పాటు... అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీ, ఎమర్జెన్సీ, సర్జరీ సేవలు రోగులకు అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సూపరింటెండెంట్ రాజారావు మాటాల్లోనే విందాం..

Interview with Gandhi Hospital Superintendent Rajarao
గాంధీలో సాధారణసేవలు ప్రారంభం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

By

Published : Nov 21, 2020, 4:46 PM IST

తొమ్మిది నెలల తర్వాత గాంధీ ఆసుపత్రి సాధారణ రోగులకు సేవలు అందించడం ప్రారంభించింది. రాష్ట్రంలో కొవిడ్​ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో మార్చ్​ 24న కొవిడ్​ నోడల్​ సెంటర్​గా గుర్తించిన సర్కారు... అక్కడ కేవలం వైరస్​ భారిన పడినవారికే చికిత్స ఇవ్వాలని నిర్ణయించింది.

అప్పటి నుంచి వేలాది మంది రోగులకు చికిత్స అందించిన గాంధీ.. ఇటీవల కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు... మహమ్మారి సోకిన వారిలో అత్యధికశాతం మంది ఐసోలేషన్​లోనే ఉంటూ వైరస్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ... సాధారణ ఓపీని ప్రారంభించింది.

నేటి నుంచి గాంధీలో కొవిడ్ సేవలతో పాటు... అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీ, ఎమర్జెన్సీ, సర్జరీ సేవలు రోగులకు అందిస్తున్నారు. ఓపీ సేవలు ప్రారంభిస్తున్నట్టు అధికారులు ముందస్తుగా ప్రకటించటం వల్ల తొలి రోజు స్వల్ప సంఖ్యలో రోగులు గాంధీకి చేరుకున్నారు. కొవిడ్, నాన్ కొవిడ్ రోగుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయటం సహా... వైద్యుల సన్నద్ధత.. గాంధీలో ఏర్పాట్లపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో మా ఈటీవీభారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

గాంధీలో సాధారణసేవలు ప్రారంభం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

ఇవీ చూడండి:మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ... ఎందుకంటే...?

ABOUT THE AUTHOR

...view details