Top Model of the World India 2023 Winner Aishwarya Interview: అమ్మాయిలు వందల సంఖ్యలో పాల్గొనే అందాల పోటీల్లో బ్యూటీ ఎంత ముఖ్యమో బ్రెయిన్ కూడా ఎంతే ముఖ్యం. మరీ అలాంటి అందాల పోటీల్లో ఒకవైపు డాక్టర్‌గా రాణిస్తూ మరోవైపు మోడలింగ్ రంగంలో ప్రతిభ కనబరిచి ఏకంగా టాప్ మోడల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా 2023 విజేతగా నిలిచింది.
ఆమే... ఐశ్వర్య పాతపాటి. సేవా భావం, అందంతో తళుక్కమన్న ఆమె.. ప్రస్తుతం ఈజిప్ట్‌లో జరుగుతున్న టాప్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ 2023 ఫినాలేలో భారత్ తరఫున మన హైదరాబాదీ పాల్గొనబోతోంది. ఒకవైపు రోజంతా డాక్టరుగా సేవలందించే ఐశ్వర్య పాతపాటి.. ఏ విధమైన ప్రణాళికతో ఈ స్థాయికి చేరుకుంది.? ప్రపంచ వేదికపై మెరవబోతున్న ఐశ్వర్య.. అందుకోసం ఎలా సన్నద్ధమవుతోంది ? మోడలింగ్‌లో తన స్వప్నం సాకారానికి ఐశ్వర్యకున్న ప్లాన్స్ ఏంటి.? ఇలాంటి విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
టాప్ మోడల్ ఆఫ్ ద వరల్డ్ కార్యక్రమాన్ని వరల్డ్ బ్యూటీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూబీవో) నిర్వహిస్తుంది. వరల్డ్ బ్యూటూ ఆర్గనైజేషన్ 2023 పోటీలు ఈజిప్టులో ఫిబ్రవరి 19 న ప్రారంభమయ్యాయి. మార్చి 3 న తుదీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో అన్ని దేశాల నుంచి ఎంపికైన మోడల్స్ పాల్గొంటారు. ఈ పోటీలకు ఇండియా తరఫున పంపే అభ్యర్థి(మోడల్) కోసం దిల్లీలో టాప్ మోడల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో మొత్తం 30 మంది మధ్య పోటీ జరగ్గా.. దాంట్లో ఐశ్వర్య పాతపాటి విజేతగా నిలిచారు.