హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్.. ప్రాక్టీస్ రేస్-1 షురూ - Hyderabad car racing competitions
Hyderabad Formula E Race: హైదరాబాద్‌లో మళ్లీ ఫార్ములా ఈ రేసింగ్ హడావిడి మెుదలైంది. రేపు జరగనున్న మెయిన్ రేస్‌కు సంబంధించి ఈరోజు ప్రాక్టీస్ సెషన్లు జరుగుతున్నాయి. హైదరాబాదులో మొదటిసారి జరుగుతున్న ఫార్ములా ఈ రేస్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ ఫార్ములా రేసర్లు ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్నారు. పూర్తిగా ఇవి బాటలో నడుస్తున్న ఈ రేస్‌లో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఫార్ములా రేసర్లు సామ్ బర్డ్, జర్మనీకు చెందిన ఆండ్రే లాటెరర్ నెక్లెస్ రోడ్డులో రేపు జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా రేస్‌లో పాల్గొనున్నారు. ఎన్నో అంతర్జాతీయ ఫార్ములా రేసుల్లో పాల్గొన్న రేస్ డ్రైవర్లు సామ్ బర్డ్, ఆండ్రే లాటెరర్లతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
Hyderabad Formula E Race