తెలంగాణ

telangana

ETV Bharat / state

Digital survey: 'డిజిటల్‌ సర్వేతో పొరపాట్లు జరిగే ఆస్కారం ఉండదు'

రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర డిజిటల్‌ సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టనుంది. ఇందుకోసం హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో 3 చొప్పున గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ సాయంతో డిజిటల్ విధానంలో సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యులు కానున్నాయి. సర్వే విధానం, సాంకేతిక పరిజ్ఞానం వాటి ఫలితాలపై సర్వే సంస్థ రెడ్‌ బే టెక్నాలజీస్‌ సీఈఓ, వింగ్​ కమాండర్ శ్రీధర్​తో 'ఈటీవీ భారత్​' ముఖాముఖి.

lands digitalization
భూముల డిజిటల్ సర్వే

By

Published : Jun 11, 2021, 7:19 AM IST

ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఆధారంగా సర్వే చేస్తున్నాం: శ్రీధర్​

'పూర్తిగా డిజిటల్‌ విధానంలో భూములను సర్వే చేస్తాం. ఈ విధానం ద్వారా పొరపాట్లు జరిగే ఆస్కారం ఉండదు. డిజిటల్​ సర్వే ద్వారా చిన్న, సన్నకారు రైతులకు భూహక్కులు కలుగుతాయి. మెుదట డ్రోన్ల ద్వారా సర్వే చేసి తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్తాం. ఇంచు భూమిని కూడా వదలకుండా కచ్చితత్వంతో కొలుస్తాం. సర్వే పూర్తైన తర్వాత మానవ ప్రమేయం తక్కువగా ఉంటుంది. వ్యవసాయ భూముల సర్వే మాదిరిగానే పట్టణాల్లో సర్వే ఉంటుంది. రాష్ట్రంలో అన్ని భూముల సర్వేను 12 నుంచి 15 నెలల్లో పూర్తి చేయొచ్చు.'

శ్రీధర్​, రెడ్‌ బే టెక్నాలజీస్‌ సీఈఓ

ఇదీ చదవండి:Report: తెలంగాణలో భారీగా ప్రాణాధార మందుల ఉత్పత్తి

ABOUT THE AUTHOR

...view details