తెలంగాణ

telangana

ETV Bharat / state

విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి - బృహతి చెరుకూరి

విలువలు.. విశ్వసనీయతే ప్రధాన బలంగా ఈటీవీ భారత్ ముందుకు సాగుతోందని సంస్థ డైరెక్టర్ బృహతి చెరుకూరి అన్నారు. దేశవ్యాప్తంగా 13 భాషల్లో కచ్చితమైన వార్తలతో ఈటీవీ భారత్‌ డిజిటల్‌ వార్తావేదిక ప్రజలకు శరవేగంగా చేరువైందని చెప్పారు. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ పబ్లిషర్స్ -వాన్ ఇఫ్రా ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన డిజిటల్ మీడియా-2020 సదస్సులో ఆమె పాల్గొన్నారు.

etv bharat director
etv bharat director

By

Published : Feb 19, 2020, 3:55 PM IST

Updated : Feb 19, 2020, 10:23 PM IST

విలువలే మా బలం

కచ్చితత్వం.. విలువలు.. విశ్వసనీయతే ప్రధాన బలాలుగా ఈటీవీ భారత్ పయనం సాగిస్తోందని.. సంస్థ డైరెక్టర్ బృహతి చెరుకూరి అన్నారు. దేశవ్యాప్తంగా 13 భాషల్లో కచ్చితమైన వార్తలు అందించే డిజిటల్ వార్తా వేదికగా ఈటీవీభారత్ నిలిచిందని చెప్పారు. అంతర్జాతీయ వార్తాపత్రికలు, పబ్లిషర్ల అసోసియేషన్ వాన్ - ఇఫ్రా సంస్థ.. దిల్లీలో నిర్వహించిన దక్షిణాసియా డిజిటల్ ఇండియా-2020 సదస్సులో ఆమె పాల్గొన్నారు.

'హౌ టు కల్టివేట్ ఎ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూస్ రూం' అనే అంశంపై ప్రసంగించిన బృహతి... ఏడాది కాలంలో ఈటీవీ భారత్ పయనాన్ని వివరించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్​వర్క్ సాయంతో మారుమూల ప్రాంతాల్లో వార్తలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. కష్టమైన రంగాలు ఎంచుకుని మరీ భారత మహిళలు తమ కలలు సాకారం చేసుకుంటున్నారని కొనియాడారు. వారి గాధలను ఈటీవీ భారత్ ద్వారా ప్రజలకు ఏ విధంగా చేరువచేసిందీ వివరించారు. రామోజీ గ్రూప్‌ 50 ఏళ్లుగా అనేక రంగాల్లో సేవలందిస్తోందని గుర్తుచేశారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖ గాయకులతో.. వైష్ణవ జనతో గీతం ఆవిష్కరించామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన ఆవశ్యకతపై దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తున్నారు.

దేశవ్యాప్త డిజిటల్‌ వార్తా వేదిక

ఈటీవీభారత్ దేశంలోనే అత్యధిక విస్తృతి ఉన్న డిజిటల్ వార్తా వేదిక అని బృహతి తెలిపారు. ఐదు దశాబ్దాలు అనుభవం ఉన్న రామోజీ గ్రూపు... 45ఏళ్లుగా ఈనాడు పత్రిక నిర్వహిస్తోందని.. జిల్లా పత్రికల ద్వారా స్థానిక వార్తలకు ప్రాముఖ్యం కల్పించిందన్నారు. అదే బాటలో ఈటీవీ భారత్ దేశవ్యాప్తంగా స్థానిక వార్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని బృహతి చెప్పారు.

బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డు

'ఈటీవీ భారత్' దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డును గెలుచుకుంది. డిజిటల్ మీడియాలో ఉత్తమ ఆవిష్కరణలకు గాను... వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ సంస్థ 'వాన్-ఇఫ్రా' ఈ పురస్కారాన్ని అందించింది. ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి చెరుకూరి దిల్లీలో అవార్డు అందుకున్నారు.

విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి

ఇవీ చూడండి:దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

Last Updated : Feb 19, 2020, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details