ETV Balabharat Channel: గ్రాఫిక్స్, యానిమేషన్ వంటి వాటిని పిల్లల పాఠ్యాంశాల్లో భాగం చేయాలని.. తద్వారా వారిలో సృజనాత్మకత పెంపొందించవచ్చని ఈటీవీ బాలభారత్ ఛానెల్ ఆపరేషన్స్ హెడ్ శశి ప్రకాశ్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత దేశ అతిపెద్ద డిజిటల్ ఎంటర్ టైన్‌మెంట్ ఫెస్టివల్.. 'ఇండియా జాయ్'లో బ్రాడ్‌కాస్ట్‌పై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచి గ్రాఫిక్స్, త్రీడీ టెక్నాలజీ, డిజిటల్ విద్యను అందించాలన్నారు.
అవి పిల్లల పాఠ్యాంశాల్లో భాగం చేయాలి: ఈటీవీ బాలభారత్ హెడ్ - ఇండియా జాయ్లో బ్రాడ్‌కాస్ట్‌పై ప్యానెల్ చర్చ
ETV Balabharat Channel: గ్రాఫిక్స్, యానిమేషన్ వంటి వాటిని పిల్లల పాఠ్యాంశాల్లో భాగం చేయాలని.. తద్వారా వారిలో సృజనాత్మకత పెంపొందించవచ్చని ఈటీవీ బాలభారత్ ఛానెల్ ఆపరేషన్స్ హెడ్ శశి ప్రకాశ్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత దేశ అతిపెద్ద డిజిటల్ ఎంటర్ టైన్‌మెంట్ ఫెస్టివల్.. 'ఇండియా జాయ్'లో బ్రాడ్‌కాస్ట్‌పై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు.
ETV Balabharat
ఫలితంగా పుస్తకాల్లో ఉన్న అంశాలను చూపిస్తూ.. పిల్లలు వాటిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవటంతోపాటు క్లిష్టమైన అంశాలను గుర్తుంచుకోగలరని అన్నారు. విదేశాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా యానిమేటెడ్ షోలు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా.. భారత్‌లో ఇటీవలే వాటికి అత్యంత ప్రాముఖ్యత లభిస్తోందన్నారు. ఈటీవీ బాలభారత్‌లో ప్రసారమైన బాల బాహుబలి షోకి ఎంతో ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: