తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక
దక్షిణ భారత టెలివిజన్ రంగంలో సంచలనాలకు శ్రీకారం చుట్టిన మీటీవీ- ఈటీవీ.. గురువారంతో 25ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. తెలుగునాట వినోదానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఈటీవీ.. ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో ప్రేక్షక జనరంజకమైన ఎన్నో కార్యక్రమాలతో అలరించింది. మరెన్నో ప్రయోగాలకు వేదికగా నిలిచింది. డైలీ సీరియల్స్, పౌరాణిక ధారావాహికలు, రియాల్టీ షోలు, క్విజ్ పోటీలు, ఆటలు, పాటలతో అన్ని వర్గాలను అలరిస్తూ.. ఎన్నో విజయశిఖరాలను అధిరోహించింది. తెలుగు రాష్ట్రాల్లో అమితంగా విశ్వసించే ఈటీవీ-న్యూస్.. నిజాయితీగా, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారి పల్లెపల్లెలో సుప్రభాతమై భాసిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
'ఈటీవీ'కి చిరు రజతోత్సవ శుభాకాంక్షలు
ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. శుభాకాంక్షలు తెలిపారు. ప్రథమ వార్షికోత్సవం నుంచి ఇప్పటి వరకు తనకు సంస్థ నుంచి అరుదైన గౌరవం దక్కిందని చెప్పారు. మొదటి, 20వ వార్షికోత్సవాలకు తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని గుర్తు చేసుకున్నారు. టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుదే అని కొనియాడారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
ఈటీవీ 25వ వార్షికోత్సవం... దర్శకేంద్రుడి శుభాకాంక్షలు
ఈటీవీ 25వ వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఈటీవీ సిబ్బందికి అభినందనలు చెప్పారు. అన్నదాతలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాల్లో ఈటీవీ తనకు తానే సాటి అని రాఘవేంద్రరావు అన్నారు. శాంతినివాసంతో ఈటీవీతో తన ప్రయాణం ప్రారంభమైందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలతో తన ప్రయాణం ఈటీవీతో కొనసాగాలని కోరుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
ఈటీవీ సిల్వర్ జూబ్లీ... రాజమౌళి శుభాకాంక్షలు
ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా దర్శకుడు రాజమౌళి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీతో తనకు అవినాభావ సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దర్శకుడిగా తన పేరు మొట్టమొదట చూసుకుంది ఈటీవీలోనే అని రాజమౌళి అన్నారు. శాంతినివాసం సీరియల్ ద్వారా తన పేరు తొలిసారి ఈటీవీలోని చూసుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఈటీవీలో ఎప్పుడూ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తారన్న ఆయన.. ఏదైనా వార్త వస్తే అది నిజమో కాదో తెలియాలంటే ఈటీవీనే చూస్తారని పేర్కొన్నారు.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.