Etela at Gunpark: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ నియంత వైఖరికి ప్రజలు చరమగీతం పాడాలని సూచించారు. అమరవీరులు కోరుకున్నా తెలంగాణలో స్వేచ్ఛ, హక్కులు, ఆత్మ గౌరవాన్ని హరిస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య 12వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఆయన నివాళులర్పించారు.
పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఈటల మరో పోరాటానికి సిద్ధం కండి
etela rajender: మన స్వేచ్ఛ, హక్కుల కోసం తెలంగాణ ప్రజలు మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవ్వాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య మనందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. అమరవీరులు కోరుకున్న స్వేచ్ఛయుత, ప్రజాస్వామ్య, మనిషిని గౌరవించే తెలంగాణ మనకు రాలేదన్నారు. అణచివేస్తున్నారు
etela on cm kcr: సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్భందాలు, అణచివేతలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. స్వేచ్ఛగా ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్దేశించుకునే హక్కు కూడా లేదని విమర్శించారు. ప్రస్తుత ఈ పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. అలాగే స్వేచ్ఛగా ఒక పౌరుడు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. ఆనాడు కేసీఆర్ ఏ ఉద్యమాన్ని నమ్ముకున్నారో... అదే కేసీఆర్ ఈనాడు ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. యావత్తు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని ఈటల స్పష్టం చేశారు.
హజూరాబాద్ తిప్పికొట్టారు
Etela on huzurabad: హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ కుట్ర, కుతంత్రాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని ఈటల రాజేందర్ అన్నారు. మద్యం, డబ్బులు లొంగేది లేదని ప్రజలు నిరూపించారని తెలిపారు. హుజూరాబాద్ చైతన్యంతో మరింత మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఈటల పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు పోలీసు కిష్టయ్య. శ్రీకాంత్ చారి ఎల్బీనగర్ మంటల్లో కాలిపోయిన తర్వాత కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉన్నప్పుడు చలించిపోయిన పోలీసు కిష్టయ్య మీరు చనిపోవద్దు మేమున్నామని చెప్పి ఆనాడు తాను తుపాకితో కాల్చుకుని తెలంగాణ ప్రజానీకానికి ఓ గొప్ప చైతన్యాన్ని ఇచ్చారు. ఆయన 12వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఏ అమర వీరులైతే స్వేచ్ఛాయుత తెలంగాణ వస్తుందని ఊహించారో అదీ కాకుండా కేసీఆర్ నాయకత్వంలో అణచివేతలు, అక్రమాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క వక్తికి స్వేచ్ఛాయుత వాతావరణం లేదు. ఒక పౌరుడు తనకు నచ్చిన వారికి ఓటు వేసే పరిస్థితి లేదు. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ ఏ ప్రజల చైతన్యాన్ని నమ్ముకున్నాడో.. అదే ఈనాడు వారిని అణచివేసే పరిస్థితి కనిపిస్తోంది. అందరీ హక్కులను కాలరాస్తుండు. ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నాడు. తెలంగాణ ప్రజానీకం ప్రస్తుత పరిణామాలను గమనిస్తా ఉంది. మనం మన హక్కులు, స్వేచ్చను, ఆత్మగౌరవాన్ని కోల్పోయినం. మరల అలాంటి స్వేఛ్చాయుత తెలంగాణ కోసం ప్రజానీకం పోరాడాలి. ఎలాగైతే హుజూరాబాద్‌లో ఉపఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పారో అదే స్ఫూర్తితో ఉద్యమం కొనసాగించాలని కోరుతున్నా.
- ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే