Etela Rajender on Congress 6 Guarantees : కాంగ్రెస్ నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రకటిస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Etela Rajender) అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ హామీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలో అక్కడ ఇచ్చిన హామీలను ట్రిమ్మింగ్ చేస్తున్నారని విమర్శించారు. తాను అణగారిన వర్గాల పక్షపాతినని తెలిపారు. ఆర్థికమంత్రిగా చేసిన అనుభవంతో చెప్తున్నానని.. కాంగ్రెస్ ఇచ్చే హామీల అమలు అసాధ్యమని చెప్పారు. అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వడం శ్రేయస్కరం కాదన్నారు. రాష్ట్రంలో పింఛన్లు సరైన సమయానికి అందడం లేదని ఈటల విమర్శించారు.
'ఆర్థికమంత్రిగా చేసిన అనుభవంతో చెప్తున్నా.. కాంగ్రెస్ ఇచ్చే హామీల అమలు అసాధ్యం. కాంగ్రెస్ నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రకటిస్తున్నారు. మహిళలకు రూ.2 వేలు ఇస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ హమీలను ఎలా అమలు చేస్తారు. కర్ణాటకలో హామీలను ట్రిమ్మింగ్ చేస్తున్నారు. అణగారిన వర్గాల పక్షపాతిని నేను. అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. రాష్ట్రంలో పింఛన్లు సరైన సమయానికి అందడం లేదు.'-ఈటల రాజేందర్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్
Etela Rajender Fires on CM KCR : '75 ఏళ్లు పూర్తైన రాష్ట్రంలో సంపూర్ణ రాజ్యాంగం అమలు అవ్వలేదు'
Congress Ready to campaign on Six Guarantees :తెలంగాణలో అధికారమే లక్ష్యంగాకాంగ్రెస్(Telangana Congress) వ్యూహప్రతివ్యూహాలు, ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించి.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న పార్టీ నేతలు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఓవైపు పాదయాత్రలు.. మరోవైపు బస్సు యాత్రలు.. ఇంకోవైపు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. యువ డిక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, చేయూత కింద రూ.4000 పెన్షన్ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఆరు గ్యారంటీలను(Six Guarantees) సోనియాగాంధీ తుక్కుగూడ సభలో ప్రకటించారు. కర్ణాటకలో అయిదు హామీల గ్యారంటీ కార్డు( Five Guarantees in Karnataka) ప్రకటించడంతో.. అక్కడి ఎన్నికల్లో ఆ హామీలు తీవ్ర ప్రభావితం చూపినందున గెలిచిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
Congress Six Guarantees in Telangana :రాష్ట్రంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అంతకంటే ఎక్కువ ప్రభావితం చేసేవిగా ఉన్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కర్ణాటకలో మాదిరి తెలంగాణాలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్(Congress Party) స్పష్టం చేస్తోంది. ప్రధానంగా మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెలా రూ.2500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం(Free Travel for Women in RTC Buses), రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈ మూడు హామీలు మహిళా ఓటర్లను తీవ్ర ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తోంది.
Etela Rajender Reaction on Congress Six Guarantees కాంగ్రెస్ నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రకటిస్తున్నారు ఈటల రాజేందర్ Etela Rajendar Fires on CM KCR : 'రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుంది.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు'
Etela Rajender Fires on CM KCR : ఓడిపోతామనే.. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్