ఎంఆర్‌పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను(manda krishna madiga)... మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్(etela rajender) పరామర్శించారు. దిల్లీలో కాలికి గాయమై... విశ్రాంతి తీసుకుంటున్న మంద కృష్ణను... హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో(R.krishnaiah) ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.
హుజూరాబాద్‌లో తమతో కలిసి నడవాలని ఆర్.కృష్ణయ్యను ఈటల కోరారు. హుజూరాబాద్‌లో జరిగేది.. పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని.. కేసీఆర్(cm kcr) అహంకారానికి.. ఈటల ధర్మానికి మధ్య జరుగుతున్న పోరుగా ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కి... ఒక చక్రవర్తిలాగా, రాజులాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరుగుతోంది. అంతేకాకుండా ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు భావించినా... ప్రజాసమస్యలను ప్రస్తావించినా... ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసినా... నియంతృత్వ పోకడల మీద ప్రశ్నించినా అణచివేతకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ఇదే పద్ధతి కొనసాగుతోంది. వారు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా... అనేక పథకాల పేరిట వేల కోట్ల రూపాయల జీవోలు ఇచ్చినా... వందల కోట్లు ఖర్చు పెట్టినా హుజూరాబాద్ ప్రజలు చాలా విజ్ఞులు. చైతన్యవంతులు. ధర్మానికే పట్టం కడతారు. న్యాయానికే పట్టం కడతారు. ఇక్కడ జరిగే పోరాటం కులాలది కాదు. రాజకీయ పోరాటం కాదు. జెండాల పోరాటం కాదు. ఈ పోరాటం కేసీఆర్ అహంకారానికి... ఈటల రాజేందర్ ధర్మానికి మధ్య జరుగుతోంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఆర్.కృష్ణయ్య లాంటి వారి మద్దతు కావాలని కోరతున్నాం.
-ఈటల రాజేందర్, భాజపా నాయకుడు
ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణకు ఈటల పరామర్శ ఇదీ చదవండి:Kishan reddy: 'సమస్యలు పరిష్కరించే శక్తి ఇవ్వాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నా'