Etela Rajender comments On KCR: ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజ్యాంగం, సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాజ్‌భవన్‌లో జెండా ఆవిష్కరణలో సీఎం పాల్గొనకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గవర్నర్ కుర్చీని కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. ఆయన చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించారని ఈటల ఆరోపించారు.
అవమానించారు
"రాజ్ భవన్లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి. కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. రాజ్యాంగ సంప్రదాయాలను ఆయన తుంగలో తొక్కారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. ప్రజాస్వామ్యవాదులు బాధపడుతున్నారు. గవర్నర్ కుర్చీని కేసీఆర్ అవమానించారు. ఇది అత్యంత హేయమైంది. ప్రభుత్వం ఇటీవల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. గవర్నర్ను ఎక్కడే అవమానపరిచే పనులు కనిపిస్తున్నాయి." -- ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా ఎమ్మెల్యే