Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్పై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎన్డీఏ, యూపీఏ కూటమి మినహా మరే ఇతర కూటమి దేశంలో రాణించలేవని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్లు.. రాని వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రాష్ట్రంలో వచ్చిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారనే అహంకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం..
మేడారంలో గవర్నర్ను అవమానించారని ఈటల ఆరోపించారు. సంస్కారహీనమైన సంప్రదాయానికి కేసీఆర్ తెర తీశారని ఆరోపణలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు గురించి మాట్లాడే కేసీఆర్.. సంస్కారం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యమని కేసీఆర్కు గుర్తుచేస్తున్నానన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. భాజపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయన్న కేటీఆర్వి చిల్లర వ్యాఖ్యలని ఆయన విమర్శించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి..