తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Rajendar Counter To KTR Tweet : 'మోదీపై విమర్శలు.. కేసీఆర్‌ రెండు నాలుకల ధోరణికి నిదర్శనం'

Etela Rajendar Counter To KTR Tweet : నిజామాబాద్ ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యల అనంతరం బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరు పార్టీలకు చెందిన అందరూ నేతలు దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా చేసిన కామెంట్లకు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.

Etela Rajendar
Etela Rajendar Counter To KTR Tweet

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 5:22 PM IST

Etela Rajendar Counter To KTR Tweet : ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Etela Rajender) మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. మోదీపై విమర్శలు కేసీఆర్‌ రెండు నాలుకల ధోరణికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నైజం ఇప్పుడు పూర్తిగా బయటపడిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌ (BRS) నేతలు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Etela Rajendar Reacts on KTR Tweet : ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్‌ గజకర్ణ, గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ ప్రారంభానికి వచ్చిన మోదీనీ ఆనాడు కేసీఆర్ పొగిడారని తెలిపారు. పన్ను ఆదాయంతో రాష్ట్రాల వాటా పెంచారని మోదీని కేసీఆర్‌ పొగిడినట్లు గుర్తు చేశారు. కేసీఆర్‌ ఏ విషయాన్నైనా ప్రజలను నమ్మించే నైపుణ్యవంతుడని ఎద్దేవా చేశారు. రామగుండం ఎరువుల (Ramagundam Fertilizer Factory) ఫ్యాక్టరీని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ రైతుల సంక్షేమం కోసం మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం పునఃప్రారంభించిందని గుర్తుచేశారు.

Etela Rajendar Fires KCR Government : రాష్ట్రంలో కేంద్రం బియ్యం ఇస్తే మోదీ ఫొటో పెట్టకుండా.. కేసీఆర్ ఫొటో పెట్టుకున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మీ ఫొటో ఉండదు.. వారిలో చిర స్థాయిలో నిలిచిపోయేది ప్రధాని మోదీ మాత్రమేనన్నారు. గృహలక్ష్మి పథకంలో (Gruha lakshmi Scheme) భాగంగా ఇళ్లు మంజూరు అవుతాయా..? డబ్బులు వస్తాయా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు నమ్మితే మోసపోతారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే టూరిస్ట్ అంటున్నారు.. కానీ వీరు మాత్రం బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతిభవన్‌ వారికి అధికారిక నివాసం, పార్టీ కార్యాలయం కాదని అందులో ఇతర రాష్ట్రాల వారికి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు.

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : 'డిపాజిట్ రాని బీజేపీతో మాకు పొత్తా.. మేము పోరాడేవాళ్లమే తప్ప మోసంచేసే వాళ్లం కాదు'

మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రధానిని చీటర్‌ అన్నారు.. కానీ ఇచ్చిన హామీలను విస్మరించిన వారు పెద్ద చీటర్ అంటూ ఈటల హితవు పలికారు. దళిత ముఖ్యమంత్రి, దళిత బంధు, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పింది ఎవరు అంటూ ప్రశ్నించారు. మీకే నిఘా వ్యవస్థ ఉంటే.. ప్రధానికి ఉండదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏ ఆధారాలు లేకుండా మాట్లాడరని... సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయని వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేస్తుందని.. కేసీఆర్ ఇక ఫామ్​హౌస్​కే పరిమితం అవక తప్పదని ఈటల జోస్యం చెప్పారు.

Harish Rao on BRS Manifesto : 'బీఆర్ఎస్​ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది'

Harish Rao On BJP Congress : 'రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్​ గెలిచేది లేదు'

ABOUT THE AUTHOR

...view details