అవినీతి పాలన అంతం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి : ఈటల Etela Election campaign in Shadnagar: షాద్‌నగర్‌లో బీజేపీనిర్వహించిన విజయ సంకల్ప సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థి అందే బాబయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోర్టులో న్యాయమూర్తి తీర్పులా ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉండాలన్నారు. మన తల రాతలు మనం మార్చుకునే ఆయుధం ఓటుహక్కు అని.. అవినీతి పాలన అంతం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈటల తెలిపారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయబోయేది బీజేపీనని స్పష్టం చేశారు.
Etela Reaction on Kokapet Land Auction : 'రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పేందుకే.. ఎకరం రూ.100 కోట్ల ప్రచారం'
ప్రతి రెండు మూడు వందల మందికి ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనని ఎద్దేవ చేశారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చారని వ్యక్తం చేశారు. మద్యం షాపుల ద్వారా ప్రభుత్వానికి రూ. 45 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల బతుకులు మారాయని, యువతకు ఉద్యోగాలు వచ్చాయని కేసీఆర్ ప్రచారం చేశారు. కానీ ఎక్కడా ఇవి ఏమీ జరగలేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్య వంతులని ఈసారి కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతోన్న ఎన్నికల ప్రచారాలు - రంగంలోకి దిగుతున్న స్టార్ క్యాంపెయినర్లు
Telangana Assembly elections 2023: కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్‌లు వచ్చాయని రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మాత్రమే పరిమితం అయ్యాడని ఆరోపించారు. తను 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి మొదటి నుంచి తను ప్రయాణం చేశానన్నారు. తెలంగాణ వచ్చాక మొదటి ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి కరోనా సమయంలో ప్రజల ఇబ్బందులను తొలగించానన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులను పొట్టన బెట్టుకున్న ఘనత కేసీఆర్‌దే అని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలించిన 45 ఏళ్లలో ఒక్కసారి ఐనా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది. మొదటి నుంచి తనతో ప్రయాణించిన షాద్‌నగర్ అభ్యర్థి అందె బాబయ్యను గెలిపించాలని అన్నారు. కేసీఆర్‌కు మరొక్కసారి అధికారం ఇచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని హెచ్చరించారు.
Etela Reaction on Kokapet Land Auction : 'రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పేందుకే.. ఎకరం రూ.100 కోట్ల ప్రచారం'
మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం: ఈటల రాజేందర్