Etela Comments on CM KCR :బీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే తాను కేసీఆర్‌పై గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తానని. ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేదల భూములను లాక్కొని.. భూ దందాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
Etela Coments on KCR Govt :అభివృద్ధి పేరుతో ప్రజల అసైన్డ్ భూములను గుంజుకుంటూ.. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఈటల(Etela Rajender) దుయ్యబట్టారు. అభివృద్ధి పేరుతో, ల్యాండ్ ఫూలింగ్ చేసి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పేదల భూములను లాక్కొని దళితులను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే 30 వేల కేసీఆర్ బాధిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.
"డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి, బీసీబంధు ఇస్తానని చెప్పి మాయమాటలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ సంపన్న రాష్ట్రమని చెప్పే కేసీఆర్.. పథకాలను ప్రజలందరికి ఎందుకు ఇవ్వడంలేదు. నేడు రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఏపూటకు ఆ పూట ఖర్చు పెట్టుకునే విధంగా మారింది. నీళ్లు, నిధులు, నియమాకాల ఆశయంతో ఏర్పడిన తెలంగాణ.. నేడు కేసీఆర్ పాలనలో సదరు లక్ష్యం నీరుగారిపోయింది. రాష్ట్ర యువతకు ఉద్యోగ నియామాకాల్లో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. నేడు రాష్ట్రంలో ఉద్యోగాలు ప్రతిభ ఉన్నవారికి, చదువుకున్నవారికి కాకుండా.. పైరవీలు చేసుకున్నవారికి కొలువులు వచ్చే పరిస్థితి దాపురించింది." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
'తెలంగాణ సమాజం ప్రేమకు లొంగుతుందే తప్ప భయభ్రాంతులకు గురిచేస్తే లొంగదు'