తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటల సంచలన ప్రకటన.. 'గజ్వేల్​ నుంచి పోటీ.. బంగాల్​ సీన్​ రిపీట్​..' - Etala Rajender comments on cm kcr

Etela: ఈటల సంచలనం.. గజ్వేల్​ నుంచి పోటీ..
Etela: ఈటల సంచలనం.. గజ్వేల్​ నుంచి పోటీ..

By

Published : Jul 9, 2022, 3:04 PM IST

Updated : Jul 9, 2022, 10:58 PM IST

14:59 July 09

Etela Rajender Comments: గజ్వేల్‌లో సీరియస్‌గా వర్క్ చేస్తున్నా: ఈటల

Etela Rajender Comments: మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానన్నారు. సీఎం ఇలాకా గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ముందే చెప్పానన్న ఈటల.. ఇందుకోసం గజ్వేల్​లో సీరియస్​గా వర్క్​ చేస్తున్నట్లు తెలిపారు. తాను తెరాసలో చేరిందీ గజ్వేల్ నియోజకవర్గం నుంచే అని గుర్తు చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాటామంతిలో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల పేర్కొన్నారు. పశ్చిమ బంగాలో సువేందు అధికారి దృశ్యం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని తెలిపారు. బంగాల్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రత్యేక దృష్టి పెట్టానన్న ఈటల.. భాజపాలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

నేను మొదట తెరాసలో చేరింది కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచే. గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని ముందే చెప్పాను. ఇందుకోసం గజ్వేల్‌లో సీరియస్‌గా వర్క్ చేస్తున్నా. కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సువేందు అధికారి దృశ్యం తెలంగాణలో పునరావృతం అవుతుంది. బంగాల్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలి. ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను. భాజపాలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. -ఈటల రాజేందర్​, భాజపా ఎమ్మెల్యే

మరోవైపు గిరిజన మహిళలపై కేసీఆర్ సర్కారు దాడులకు పాల్పడుతుందని ఈటల ఆరోపించారు. ఓవైపు భాజపా ప్రభుత్వం ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి పదవిని కట్టబెడితే.. కేసీఆర్ ప్రభుత్వం గిరిజన మహిళలపై చేయి చేసుకుంటుందని మండిపడ్డారు. గిరిజనుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అసహ్యించుకునేలా ఉందన్నారు. సీఎం తన 8 ఏళ్ల పాలనలో ఒక ఎకరం అసైన్డ్‌ భూమినీ పంచలేదని విమర్శించారు.

ప్రైవేట్​ వ్యక్తులకు కట్టబెట్టేందుకే..: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసి.. ల్యాండ్​ పూలింగ్​ పేరుతో భూములను సేకరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఆ భూములను ప్రైవేట్​ వ్యక్తులకు కట్టబెట్టేందుకే గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూముల విషయంలో దళితులకు భాజపా అండగా ఉంటుందన్నారు.

భాజపా ఎస్టీ మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశమిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం గిరిజన మహిళలపై దాడులు చేస్తోంది. సీఎం గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానవీయం. కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో ఎకరం అసైన్డ్ భూమి పంచలేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు. ల్యాండ్‌ పూలింగ్ పేరుతో భూములను సేకరిస్తున్నారు. అసైన్డ్‌ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కరించాలి.-ఈటల రాజేందర్​

ఇవీ చూడండి..

Eetela meet Amitshah: 'దిల్లీలో అమిత్‌షాను కలిసిన ఈటల'

Draupadi Murmu: జులై 12న హైదరాబాద్​కు ద్రౌపది ముర్ము

'నేను దుర్గాదేవిని.. నా భర్తను వదలండి'.. మహిళ హైడ్రామా.. పోలీస్ స్టేషన్​లో చేతబడి!

Last Updated : Jul 9, 2022, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details