తెలంగాణ

telangana

ETV Bharat / state

Etala Rajendar Comments On BRS :'జాగ్రత్తగా ఉండాలని కొన్ని నెలలుగా బెదిరిస్తున్నారు'

Etala Rajender Clear That He Will Not Leave BJP : ప్రగతిభవన్​లో కేసీఆర్​ వేసిన స్కెట్​ వల్లే హుజురాబాద్​ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నాని ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ మండిపడ్డారు. కౌశిక్​ రెడ్డి హుజురాబాద్​లో అరాచకాలు సృష్టించడానికే ఉన్నారని ధ్వజమెత్తారు. నాలుగైదు నెలల నుంచి తనకు జాగ్రత్తగా ఉండాలని బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని.. తాను నయీంకే భయపడలేదని స్పష్టం చేశారు.

etala rajendar
etala rajendar

By

Published : Jun 27, 2023, 6:00 PM IST

Etala Rajendar on Security : అక్రమ సంపాదనకు ధరణి వేదిక అయ్యిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ధరణి రావడంతో పేదల భూములు మాయమయ్యాయని తెలిపారు. ధరణితో కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఈటల ఆరోపించారు. శామీర్‌పేటలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈసారి కేసీఆర్​కు ఓటు వేయవద్దని రైతులంతా భావిస్తున్నారని ఈటల రాజేందర్​ చెప్పారు. తెలంగాణ పల్లెల్లో బీఆర్​ఎస్​ ఓటమి తప్పదని మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మోడల్​ దేశానికి అందిస్తానన్న కేసీఆర్​.. ఇక్కడి ప్రజలకు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ మళ్లీ అధికారంలోకి వస్తే తమ బతుకులు ఆగమేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని వివరించారు. బీజేపీ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిందని.. పార్టీని వాడవాడలా తీసుకెళుతున్నామని పేర్కొన్నారు.

Etala Rajendar Comments On Dharani Portal : ప్రగతిభవన్​లో కేసీఆర్​ వేసిన స్కెట్​ వల్లే హుజురాబాద్​ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నాని ఈటల రాజేందర్​ మండిపడ్డారు. కౌశిక్​ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్​.. ముదిరాజ్​లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. గత నాలుగైదు నెలల నుంచి తనకు జాగ్రత్తగా ఉండాలనే బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని తెలియజేశారు. నయీంకే భయపడలేదని.. ఈ బెదిరింపులు ఒక లెక్కన బెదిరేది లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారలేదని.. గెంటేస్తేనే బయటకు వచ్చినట్లు వివరించారు. పార్టీలు మారడం దుస్తులు మార్చుకున్నంత.. సులువు కాదన్నారు. తనను పార్టీ నుంచి పంపించినప్పుడు కేసీఆర్​ కుటుంబీకులు బాధపడి ఉంటారని అన్నారు.

Etala Rajendar Comments On MLC Kaushik Reddy : జాతీయ రాజకీయలు తనకు కొత్తమే కాదని.. తనకు తాను దిల్లీ వెళ్లలేదని.. అపాయింట్​మెంట్​ కోరలేదని ఈటల రాజేందర్​ తెలిపారు. బీజేపీ అధిష్ఠానం పిలిస్తేనే.. దిల్లీకి తాను వెళ్లానని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ను కొట్టేది.. బీజేపీ మాత్రమేనని సవాల్​ విసిరారు. బీజేపీ నేతలతో మాట్లాడే వారిపై కక్ష సాధించి.. వారితో ఫొటోలు దిగిన హింసిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్​ మరోసారి గెలిస్తే.. రాష్ట్రంలో నిరంకుశత్వం మరితం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. ప్రజలకు కేసీఆర్​ మీద నమ్మకం పోయిందని.. తెలంగాణలో గెలిచేది బీజేపీ మాత్రమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Etala Rajendar Clearty About Quit BJP : హుజురాబాద్​లో ప్రజలను తిట్టే బాధ్యతను కేసీఆర్​.. కౌశిక్​ రెడ్డికి అప్పగించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సింది కౌశిక్​ రెడ్డి కాదని.. కేసీఆర్​నే చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రజలను గడ్డిపోచగా భావిస్తున్న కేసీఆర్​కు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని మండిపడ్డారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details