తెలంగాణ

telangana

ETV Bharat / state

Etala Jamuna Slams MLC Kaushik Reddy : 'ఈటల రాజేందర్​ను రూ.20 కోట్లతో చంపేందుకు కౌశిక్​ రెడ్డి ఫ్లాన్'​ - ఈటల జమున విమర్శలు

Etala Jamuna On MLC Kaushik Reddy : ఈటల రాజేందర్​ను రూ.20 కోట్లు ఇచ్చి చంపేస్తామని.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి అన్నారని ఈటల సతీమణి ఈటల జమున సంచలన ఆరోపణ చేశారు. సీఎం కేసీఆర్​ ఓ పిచ్చికుక్కను ఎమ్మెల్సీ చేసి హుజురాబాద్​ మీదకు వదిలేశారని ఆమె ధ్వజమెత్తారు. ఈ మేరకు శామీర్​పేటలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

Etala Jamuna
Etala Jamuna

By

Published : Jun 27, 2023, 3:24 PM IST

Updated : Jun 27, 2023, 3:43 PM IST

Etala Jamuna Comments On MLC Kaushik Reddy : హుజురాబాద్​ ఎమ్మెల్సే ఈటల రాజేందర్​ను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి కుట్ర పన్నుతున్నారని రాజేందర్​ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శామీర్​పేటలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె.. ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈటల రాజేందర్​ను కౌశిక్​ రెడ్డి రూ.20 కోట్లు ఇచ్చి చంపేస్తామని అన్నారని.. దీని వెనుక సీఎం కేసీఆర్​ హస్తం ఉందని ధ్వజమెత్తారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించారు.

Kaushik Reddy Plan To Kill Etala Rajender Rs 20 Crore : ఈటల కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి హాని జరిగిన సరే.. దానికి కేసీఆర్​నే కారణం అవుతారని ఈటల జమున స్పష్టం చేశారు. కౌశిక్​ రెడ్డి లాంటి శాడిస్టులను పార్టీలో పెట్టుకుని.. కేసీఆర్​ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్​ను చంపేస్తామంటే ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్​ ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి హుజురాబాద్​ మీద వదిలేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారిని సీఎం స్వయంగా హుజురాబాద్​ ప్రజలపైకి ఉసిగొల్పారని ధ్వజమెత్తారు.

ఈటల రాజేందర్​ను చంపేందుకు కేసీఆర్​ కుట్ర

"ఉద్యమ సమయంలో కేసీఆర్​కు కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్​ను రూ.20కోట్లకు చంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పింది ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి. నయీం లాంటి వ్యక్తులు ఉద్యమం చేసినప్పుడు చంపేస్తామని బెదిరించారు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకు భయపడతామా. కేసీఆర్​ చెప్పితేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. లక్షల కోట్లు సంపాదించి ఈ రోజు కేసీఆర్​ తనకు అడ్డువచ్చిన వారిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు." - ఈటల జమున, ఈటల రాజేందర్​ భార్య

Etala Jamuna Sensational Comments On MLC Kaushik Reddy : కౌశిక్​ రెడ్డి హుజురాబాద్​లో అరాచకాలు సృష్టిస్తున్నారని ఈటల జమున ఆక్షేపించారు. హుజురాబాద్​ టికెట్​ను కౌశిక్​ రెడ్డికి ప్రకటించిన తర్వాతనే.. తన ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. ఆయన ఆ నియోజకవర్గ ప్రజలను హింసిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో ఈటల రాజేందర్​ సంతృప్తిగానే ఉన్నారని.. పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారని వెల్లడించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఈటల రాజేందర్​ భార్య జమున స్పష్టం చేశారు. ఈటలను చంపడానికి రూ.20కోట్లుతో కాదు.. ప్రజలు ఓటుతోనే కేసీఆర్​కు బుద్ధి చెపుతారని ఈటల జమున అభిప్రాయపడ్డారు. అమరవీరుల స్తూపాన్ని తాకే అర్హతలేని కౌశిక్​ రెడ్డి.. జేసీబీతో అమరుల స్మారకాన్ని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కౌశిక్​రెడ్డిపై డీజీపీకి ముదిరాజ్​ ఐకాస ఫిర్యాదు : మరోవైపు ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి ముదిరాజ్​లను కించపరిచేలా మాట్లాడిన మాటలు పట్ల డీజీపీకి తెలంగాణ ముదిరాజ్​ ఐకాస ఫిర్యాదు చేసింది. ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం దాఖలు చేసింది. మరోపైపు కౌశిక్​ రెడ్డిపై గవర్నర్​కు కూడా ఫిర్యాదు చేస్తామని ముదిరాజ్​ ఐకాస తెలిపింది. ఈ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కౌశిక్​ రెడ్డికి బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. కౌశిక్​ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని.. సీఎం కేసీఆర్​ను కోరారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 27, 2023, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details