తెలంగాణ

telangana

ETV Bharat / state

Internal Disputes in Telangana BJP : కమలంలో కల్లోలం!.. 'ఇంటింటికీ బీజేపీ'కి ఈటల, రాజగోపాల్​రెడ్డి దూరం

BJP Door to Door Programme in Telangana : దేశంలో నరేంద్ర మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలందరూ "ఇంటింటికీ బీజేపీ" పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించాలని అధిష్ఠానం పిలుపునిచ్చింది. అయితే.. పార్టీ కీలక నేతలైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

Bjp
Bjp

By

Published : Jun 22, 2023, 3:09 PM IST

Internal disputes in Telangana BJP : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న కమలంలో కల్లోలం మొదలైంది. నివురు గప్పిన నిప్పులా నేతల మధ్య.. నెలకొన్న అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌.. రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం ఇద్దరు నాయకులను దిల్లీ పిలిపించుకొని విభేదాలు పక్కనపెట్టి బీజేపీ విజయానికి పని చేయాలని దిశానిర్దేశం చేసింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఈ మంతనాలు విజయవంతం కాలేదు.

"ఇంటింటికి బీజేపీ" ప్రచార కార్యక్రమానికి పార్టీ సీనియర్లు దూరంగా ఉన్నారు. పార్టీ కీలక నేతలైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటికీ బీజేపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

Bandi Sanjay latest news : నేటి నుంచి జిల్లాలో బండి సంజయ్ పర్యటన​.. షెడ్యూల్​ ఇదే..!

అధిష్ఠానం వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్న ఈ ఇద్దరు నేతలు.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అంటూ జోరుగా ప్రచారం జరగడంపై ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటలకు వ్యతిరేకంగా సమావేశమై అసలు పార్టీలో ఆ పదవే ఉండదని.. జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలతో చర్చించాకే ప్రకటిస్తుంది తప్పితే లీక్​లు ఇవ్వదని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఈటల రాజేందర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనంగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అసంతృప్తిలో ఉన్నారని.. మళ్లీ కాంగ్రెస్​లోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది.

Etela Rajender Sensational Comments : బీఆర్ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. కాషాయతీర్థం పుచ్చుకుంటారని భావించినా.. ఆ పరిస్థితి లేకుండాపోయింది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల చేసిన ప్రయత్నాలు విఫలం కాగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారం రేపుతున్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్‌ బలంగా ఉందని.. ఆ ఇద్దరు బీజేపీలోకి రావడం కష్టమేనని చెప్పడం శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది.

BJP High Command is Angry on TS Leaders : ఈటల వ్యాఖ్యలతో బీజేపీలో చేరికలుండవని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాయకులు ఎవ్వరూ పార్టీకి నష్టం చేకూర్చేలా మాట్లాడవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు చేరికల సంగతి పక్కనపెడితే.. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలువురు కమలాన్ని వీడుతున్నారని.. సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details