తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎస్​ను కలిసిన ఈస్తోనియా దేశ ప్రతినిధి బృందం - telangana varthalu

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా దేశ ప్రతినిధి బృందాన్ని సీఎస్​ సోమేశ్​ కుమార్​ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంస్కరణలు, కార్యక్రమాలను ఈస్తోనియా ప్రతినిధి బృందానికి సీఎస్ వివరించారు.

సీఎస్​ను కలిసిన ఈస్తోనియా దేశ ప్రతినిధి బృందం
సీఎస్​ను కలిసిన ఈస్తోనియా దేశ ప్రతినిధి బృందం

By

Published : Mar 5, 2021, 5:52 PM IST

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా దేశ ప్రతినిధి బృందాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. ఈస్తోనియా రాయబారి కేత్రిన్ కివి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జూయీ హియోహి బీఆర్కే భవన్​లో సీఎస్, అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంస్కరణలు, కార్యక్రమాలను ఈస్తోనియా ప్రతినిధి బృందానికి సీఎస్ వివరించారు. భూరికార్డుల డిజిటలైజేషన్, ఈ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ సహా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వారికి తెలిపారు.

ఇదీ చదవండి: కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి: జీహెచ్​ఎంసీ మేయర్​

ABOUT THE AUTHOR

...view details