నిజాంపేట్, మరో మూడు గ్రామపంచాయతీలను కలిపిమున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట్ గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్ ఏర్పడింది. కార్పొరేషన్లో 33 వార్టులు ఉండగా.. లక్ష 7వేల 218ఓట్లు ఉన్నాయి. లక్ష 50వేల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో విలీనం చేస్తున్నారనే ఊహాగానాలతో ఉన్నప్పటికీ ఈనెల 23న ఎన్నికల కమిషన్ ప్రకటనతో ఇక్కడి రాజకీయ నేతల్లో ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీల నాయకులు తమ అధినేతకి ఫోన్‌చేసి... మమ్మల్ని మర్చిపోకండి అంటూ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నిజాంపేట్‌లో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు - Establishment of New Municipal Corporation in Nizampet
హైదరాబాద్ నిజాంపేట్ కార్పొరేషన్‌లోని మూడు గ్రామపంచాయతీలను కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట్ గ్రామ పంచాయతీలు కలిపి కార్పొరేషన్ ఏర్పడింది.
![నిజాంపేట్‌లో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు Establishment of New Municipal Corporation in Nizampet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5520792-858-5520792-1577528826772.jpg)
నిజాంపేట్‌లో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు
నిజాంపేట్‌లో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు