Universities staff: విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నిమాయకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకం ఉమ్మడి బోర్డు ద్వారా జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యక్షుడిగా, విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను బోర్డులో సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. కళాశాల విద్యాశాఖ కమిషనర్ బోర్డు కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే మరో సభ్యుడిగా నిపుణులను నియమించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలి?తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో దాదాపు వెయ్యికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతిచ్చింది. నియామక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు.
Universities staff: విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు.. ఉత్తర్వులు జారీ - board
17:26 June 23
Universities staff: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అధ్యక్షతన వర్సిటీ సిబ్బంది నియామక బోర్డు
వైద్య విశ్వవిద్యాలయం మినహా మిగతా 12 వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు త్వరలో చేపట్టనున్నారు. దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఒక్కో యూనివర్సిటీలో వేర్వేరుగా నియామకాలు చేపడితే.. కొన్నింటిలో ఖాళీలు ఏర్పాడుతున్నాయి. ఒకే అభ్యర్థి వివిధ యూనివర్సిటీలకు పోటీపడుతున్నారు. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలినవి వదిలేస్తున్నారన్న అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. బిహార్ తదితర రాష్ట్రాల్లో నియామకాలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించిన తర్వాత తెలంగాణలో కూడా నియామకాలకు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చదవండి:కేంద్రం నుంచి రాని స్పష్టత.. బియ్యం తీసుకుంటారా.. లేదా?!
మృతదేహం వద్ద బోరున ఏడ్చిన కోతి.. 20 గంటలు పాటు అక్కడే ఉండి..