కొవిడ్-19 నివారణకు చర్యలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. భాగ్యనగరం పాతబస్తీ ఛార్మినార్ సమీపంలోని నిజామియా జనరల్ వైద్యశాలలో 12 వార్డుల్లో 180 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా జ్వరం, జలుబు, తుమ్ములు వస్తున్న వారికి అలోపతి ద్వారా చికిత్స అందిస్తామని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ తెలిపారు. అటెండర్లను లోనికి అనుమతించమని చెప్పారు. రోగుల అరోగ్య పరిస్థితి క్షీణిస్తే మెరుగైన వైద్యం కోసం తమ ఆస్పత్రి అంబులెన్స్‌లో ఇతర ఆసుపత్రికి తరలిస్తామన్నారు.
నిజామియా ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు - కరోనా ఐసోలేషన్ వార్డు
హైదరాబాద్ పాతబస్తీ ఛార్మినార్ వద్ద గల నిజామియా జనరల్ ఆసుపత్రిలో కొత్తగా ఐసోలేషన్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.
![నిజామియా ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6556435-882-6556435-1585253146858.jpg)
Hospital
నిజామియా ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు