కొవిడ్‌తో మరణాలకు ధ్రువపత్రాలు ఇచ్చేందుకు జిల్లా స్థాయి కమిటీని నియమిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కరోనాతో చనిపోయిన వారికి మరణ ధ్రువపత్రాలు జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
Covid Death certificate: కొవిడ్ మరణ ధ్రువీకరణకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు
కరోనాతో మరణించిన వారికి మరణ ధ్రువపత్రం ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జిల్లా స్థాయి కమిటీని నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
కరోనాతో మరణించిన వారికి ధ్రువ పత్రం జారీ చేసేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీకి జిల్లా వైద్యాధికారి కన్వీనర్‌గా, ఆస్పత్రి సూపరింటెండెంట్ సభ్యునిగా ఉంటారని జీవోలో పేర్కొంది. ఈ కమిటీ కొవిడ్ మరణాలకు అధికారిక ధ్రువపత్రాలను అందించనున్నట్లు తెలిపారు. మృతుల బంధువులు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లో ధ్రువపత్రం జారీచేసేలా జిల్లా అధికారులు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: