గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గల్ఫ్ బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల వేతనాలపై కొత్తగా తీసుకొచ్చిన సిఫార్సులను వెంటనే ఉపసంహరించాలని మాజీ అంబాసిడర్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గల్ఫ్ కనీస వేతన వేతనాలతో విదేశాల్లోని కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే దోహదపడుతుందన్నారు.
గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లతో గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్ జేఏసీ కన్వీనర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో సర్వస్వం వదులుకొని స్వదేశాలకు వచ్చిన గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరారు.