లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి రోజూ ప్రజలకు భోజనాలు, నిత్యావసర సరుకులను అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫౌండేషన్ వారు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్లో దాదాపు వంది మంది వలస కూలీలు, నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు సంస్థ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.
నిరుపేదలకు భోజనాలు, నిత్యావసరాల అందజేత - essentials distributed by arya vaisya foundation
హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్లో వలస కూలీలు, పేదలు, భవన నిర్మాణ కార్మికులకు అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేసి.. భోజనాల ఏర్పాటు చేశారు. లాక్డౌన్ వల్ల ఎవరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో తమ వంతు సాయం చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు తెలిపారు.
నిరుపేదలకు భోజనాలు, నిత్యావసరాల అందజేత
లాక్డౌన్ ముగిసేవరకు ప్రజలెవరూ ఆకలికి అలమటించకుండా తగు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసరమై బయటకు వచ్చిన వారంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఉప్పల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది