లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు మాజీ కేంద్ర మంత్రి భాజపా నేత సుజనా చౌదరి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని యాదమ్మ నగర్లో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలకు ఆయన కిరాణా సామగ్రి అందజేశారు. పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో పంపిణీ చేసిన్నట్లు ఆయన వెల్లడించారు.
అల్వాల్లో సరకులు పంపిణీ చేసిన సుజనా చౌదరి - alwal sujana chowdary
సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని వలస కార్మికులకు భాజపా నేత సుజనా చౌదరి కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. వలస కూలీలు ఆకలికి అలమటించకూడదనే సరకులు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.
వలస కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ
ఉపాధి లేక వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని సుజనా అన్నారు. స్వస్థలాలకు వెళ్లలేక ఇక్కడ ఉండలేక తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్లు ఆయన వివరించారు. అనంతరం స్థానికంగా ఇంటింటికి వెళ్లి జాగ్రత్తలు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు నిత్యావసర సరకులను అందజేసిన సుజనా చౌదరికి వలస కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.