కరోనాపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ లాక్డౌన్ పరిస్థితుల్లో జర్నలిస్టులు చేస్తున్న సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆదివారం వాసవీ సేవా కేంద్రంలో 40 మంది జర్నలిస్టులకు కోలేటి దామోదర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక్కో పాత్రికేయునికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలను ఆయన అందించారు. కార్యక్రమంలో వాసవీ సేవా కేంద్రం అధ్యక్షులు రాజశేఖర్ గుప్తాతో పాటు పలువురు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సేవలు మరువలేనివి : కోలేటి దామోదర్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆదివారం వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో 40 మంది జర్నలిస్టులకు ఆయన నిత్యావసరాలను అందజేశారు.
నిత్యావసరాల పంపిణీ