సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫారం 1లో ఉన్న దివ్యదిశ ఛైల్డ్లైన్ సెంటర్లో ఇవాళ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈనెల 14 ప్రపంచ బాలల దినోత్సవం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు.. 20 వరకు నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ ఫిలిప్స్ తెలిపారు. ఈనెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులతో పాటు పలు రాజకీయ నేతలు పాల్గొంటారని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వ్యాసరచన పోటీలు - ప్రపంచ బాలల దినోత్సవం
ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని దివ్యదశ ఛైల్డ్లైన్ సెంటర్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం 20 వరకు కొనసాగనుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వ్యాసరచన పోటీలు