తెలంగాణ

telangana

ETV Bharat / state

2 ఏళ్ల సర్వీసు ఉంటేనే పరిహారం ఇస్తామంటున్న ఈఎస్​ఐసీ

కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ).. అందుకు పలు నిబంధనలు విధించింది. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారే ఈ పరిహారం పొందేందుకు అర్హులని వెల్లడించింది. ఇందుకోసం నేరుగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

esic to pay compensation to jobless
2 ఏళ్ల సర్వీసు ఉంటేనే పరిహారం ఇస్తామంటున్న ఈఎస్​ఐసీ

By

Published : Oct 2, 2020, 9:03 AM IST

కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన వేతన జీవులు, కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించిన కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ).. అందుకు పలు నిబంధనలు విధించింది. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసినవారే ఈ పరిహారం పొందేందుకు అర్హులని తెలిపింది.

  • ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబరు 31 వరకు ఉపాధి కోల్పోయి దరఖాస్తు చేసిన కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో నగదును జమ చేస్తారు. అర్హులు నేరుగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే వేతన జీవులు ఉద్యోగం కోల్పోతే జీవితంలో ఒకసారి ఈఎస్‌ఐసీ సంస్థ అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన (ఏబీవీకేవై) కింద నిరుద్యోగ భృతి ఇస్తోంది. ఇప్పటి వరకు గరిష్ఠంగా 90 రోజుల వేతనంలో 25 శాతం మాత్రమే చెల్లించేవారు. కరోనాతో కొత్త ఉద్యోగాల వేట కష్టమవుతుండటంతో పరిహారాన్ని 50 శాతానికి పెంచారు.
  • ఉద్యోగం కోల్పోయే సమయానికి బీమా సంస్థలో రెండేళ్లపాటు సభ్యత్వం ఉన్నవారు పరిహారం పొందేందుకు అర్హులు.
  • 90 రోజులపాటు మరో ఉద్యోగం లభించకుంటే గతంలో ఈ పరిహారం ఇచ్చేవారు. తాజాగా ఈ కాలపరిమితిని 30 రోజులకు తగ్గించారు. క్లెయిమ్‌లను దాఖలు చేసే సమయానికి నిరుద్యోగిగా ఉండాలి.
  • కార్మికులు ఐపీ నంబరు ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత యాజమాన్యం నుంచి వివరాలు తనిఖీ చేసి 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక.. రూ.20 నాన్‌జ్యుడిషియల్‌ పేపరుపై వివరాలను నమోదు చేసి, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం నకలును దగ్గర్లోని ఈఎస్‌ఐసీ కార్యాలయంలో లేదా స్పీడ్‌పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
  • ఏదేని శిక్షలో భాగంగా ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు ఈ పథకం కింద అనర్హులు అవుతారు. స్వచ్ఛంద పదవీ విరమణ, పదవీ విరమణ, లాక్‌ అవుట్‌, కార్మికశాఖ గుర్తించని సమ్మెలోని వేతన జీవులు దరఖాస్తు చేయకూడదు.

ABOUT THE AUTHOR

...view details