ఈఎస్ఐ కుంభకోణంలో అనిశా అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. బీమా వైద్య సేవల విభాగం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న వీరన్న అక్రమాలకు పాల్పడినట్లు అనిశా అధికారులు గుర్తించారు. సంచాలకురాలు దేవికారాణి తరఫున ఔషధ పరిశ్రమల నుంచి వీరన్న రూ.6లక్షల డబ్బులు తీసుకున్నట్లు తేలింది. తీసుకున్న డబ్బులను దేవికా రాణి సూచనల మేరకు పీఎంజే జువెల్లర్స్లో అప్పజెప్పినట్లు దర్యాప్తులో తేలింది.
ఈఎస్ఐ కుంభకోణం: మరొకరు అరెస్టు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇవాళ మరోకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరన్నను అనిశా అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరన్న అరెస్టుతో ఈ కేసులో నిందితుల సంఖ్య 18కు చేరుకుంది.
పలు ఔషధ పరిశ్రమల నుంచి వీరన్న 2 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారు. అంతేకాకుండా వీరన్న కూడా లంచాలు తీసుకున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఔషధాల కొనుగులుకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించడానికి ఒరిజిన్ అనే ఔషధ సంస్థ నుంచి వీరన్న 3లక్షల 15వేలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. తేజ ఫార్మా ఎండీ నుంచి కూడా 50వేల లంచం తీసుకున్నట్లు తేలింది. వీరన్నను అరెస్ట్ చేసిన అనిశా అధికారులు... న్యాయస్థానంలో హాజరు పర్చి అనంతరం రిమాండ్కు తరలించారు.
ఇవీచూడండి: అవినీతి 'దేవిక': ఒక్క అధికారి... 36 డొల్ల కంపెనీలు!