కార్మిక బీమా వైద్య సేవల సంస్థలో మందుల కొనుగోలు కుంభకోణం కేసులో కీలక అంశాలు బయడపడుతున్నాయి. ఔషధాలే కాకుండా ఏకంగా మెడికల్ కిట్ల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. 2017, 18లో కిట్ల కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దేవికారాణి, ఇతర అధికారులు, బీమా వైద్య సేవల సంస్థ డైరెక్టరేట్ కార్యాలయం సిబ్బంది కుమ్మక్కై రూ.1.76 కోట్లు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మొత్తం 22 ఇండెంట్లు ఉండగా... వాటిలో అధికారులు రెండు ఇండెంట్లను పరిశీలించగా... ఈ వ్యవహారం బయటపడింది.
2 ఇండెంట్లకే ఇంతైతే... మరి 20 ఇండెంట్లకు...
హెచ్‌ఐవీ కిట్ల పేరుతో ఈ బాగోతానికి దేవికారాణి సూత్రధారిగా నడిపించినట్టు తేలింది. రెండు ఇండెంట్లలోనే ఇంత అక్రమం జరిగితే... మిగితా 20 ఇండెంట్లను పరిశీలిస్తే మరిన్ని వ్యవహారాలు బయటపడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇతర అధికారులు, కార్మిక బీమా వైద్య సేవల సంస్థ డైరక్టరేట్ కార్యాలయం సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఎవరెవరికీ ఎంత ముట్టిందనే విషయంపైనా అధికారులు దృష్టి సారించారు.
ఈ కేసులో అనిశా ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసింది. నిందితులంతా... చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. విచారణ వేగవంతం చేసి.. మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు.
బయటపడ్డ ఈఎస్ఐ కుంభకోణంలోని కీలక అంశాలు... ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య