రాష్ట్ర శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాల కూల్చివేయవద్దంటూ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జిందాబాద్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పాశం యాదగిరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వాదనలు జరిగాయి. పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యంగం ప్రకారం ప్రభుత్వాలపై ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది నిరూప్ రెడ్డి వాదించారు. ప్రభుత్వం కొన్ని కట్టడాలను ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ భవనాల జాబితా నుంచి తొలగించిందన్నారు.
ఎర్రమంజిల్ భవనాలు కూల్చోద్దంటూ హైకోర్టులో వాదనలు - కూల్చోద్దంటూ
తెలంగాణ శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాల కూల్చివేయవద్దంటూ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సోమవారం రోజు హైదరాబాద్ జిందాబాద్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పాశం యాదగిరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వాదనలు జరిగాయి.
హెచ్ఎండీఏ చట్టంలోని అర్బన్ ఆర్ట్స్ కమిషన్కు చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పాత్ర ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా నోటిఫై చేసిన భవనాలను పరిరక్షిస్తుందని అదనపు అడ్వకేట్ జనరల్ వివరించారు. హెరిటేజ్ కమిటీకి, అర్బన్ ఆర్ట్స్ కమిషన్కు మధ్య తేడా ఏంటని హైకోర్టు అడిగింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేసేందుకు గడువు కావాలని అదనపు ఏజీ కోరారు. శాసనసభ, సచివాలయం నిర్మాణాల వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై విచారణ రేపు కూడా కొనసాగనుంది.
ఇదీ చూడండి : ఈసెట్ అభ్యర్థులకు తుదిదశ సీట్ల కేటాయింపు