తెలంగాణ

telangana

ETV Bharat / state

కూల్చివేతపై ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్

ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

By

Published : Aug 7, 2019, 5:30 PM IST

telangana-highcourt

ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. హెచ్‌ఎండీఏ 2010 మాస్టర్‌ప్లాన్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. మాస్టర్‌ప్లాన్‌లో ఎర్రమంజిల్ పురాతన కట్టడంగా ఉందని న్యాయస్థానం ప్రస్తావించింది. రెగ్యులేషన్ 13 రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని... జీవో 183 చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

చారిత్రక కట్టడాల జాబితాను రద్దు చేస్తూ జీవో 183ను ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఎర్రమంజిల్ కూల్చివేతపై జులై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా వాదనలు కొనసాగాయి.

ABOUT THE AUTHOR

...view details