ERC Chairman Sriranga rao interview : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్-ఈఆర్సీ ఛైర్మన్.. శ్రీరంగారావు తెలిపారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని ఆయన కార్యాలయంలో.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మార్చి 31లోపు విద్యుత్ సంస్కరణలపై.. ఈఆర్సీ తుది తీర్పు వెలువరిస్తుందని వెల్లడించారు. ఇటీవల ఈఆర్సీ తెలంగాణలోని.. పలు ప్రాంతాల్లో బహిరంగ విచారణ జరిపిందని, ఈ సందర్భంగా అనేక ఆసక్తికర అంశాలు... తమ దృష్టికి వచ్చాయన్నారు.
'ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు..!'
ERC Chairman Sriranga rao interview : విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ప్రభుత్వం బకాయిల వల్లే డిస్కంలు నష్టాల్లో ఉన్నాయా? డెవలప్‌మెంట్ ఛార్జీల పేరిట వసూళ్లు ఎందుకు చేస్తున్నారు? రైతులు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావుతో స్పెషల్ ఇంటర్వ్యూ..
పరిశ్రమలకు, మెట్రో సిటీలకు పీక్ లోడ్ విద్యుత్‌ను అందించే సమయంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తమకు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం లేదని ఈఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. డిస్కంలు వేస్తున్న అభివృద్ధి ఛార్జీలపై.. వినియోగదారుల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం... డిస్కంలకు రాయితీలు చెల్లించడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో... విద్యుత్ ఛార్జీల బకాయిలు భారీగా పెరిగిపోయిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రష్యాకు భారీ దెబ్బ.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ