గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు కొనసాగుతాయని ఈఆర్సీ వెల్లడించింది. చివరగా 2018 మార్చి 27న విద్యుత్ టారీఫ్ ఆర్డర్ ఇచ్చారని.. ఏఆర్ఆర్ ఆ ప్రతిపాదనలనే బహిరంగ విచారణ చేసి.. వాటినే కొనసాగిస్తుందని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ సప్లయ్ టారీఫ్‌లు, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు, అడిషనల్ సర్ఛార్జీలుగా అమలు చేస్తున్నామని పేర్కొంది.
గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు: ఈఆర్సీ - Electricity charges latest update
2021-22 సంవత్సరానికి సంబంధించి గతంలో ఉన్న టారిఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు కొనసాగుతాయని ఈఆర్సీ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఛార్జీలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
2019-20, 2020-21, 2021-22 ఏడాదికి సంబంధించి ప్రతిపాదనలు లేకపోవడంతో వాటినే కొనసాగిస్తున్నామని ఈఆర్సీ తెలిపింది. టీఎస్-ట్రాన్స్‌కోకు సంబంధించిన జనరల్ సబ్సిడీ-రూ.7,66,500, టీఎస్-ట్రాన్స్‌కో ఎస్.సి.ఎస్.డి.ఎఫ్.-రూ.1,78,500, టీఎస్-ట్రాన్స్‌కో ఎస్.టి.ఎస్.డి.ఎఫ్.-రూ.1,05.000, అసిస్టెంట్ స్పిన్నింగ్ మిల్స్‌కు సంబంధించి-రూ.14,500లు ఇలా అన్నీ కలుపుకుని మొత్తం రూ.10,64,500 సబ్సిడీని ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో ఆమోదించిందని ఈఆర్సీ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఛార్జీలే కొనసాగుతాయని ఈఆర్సీ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: జలమండలికి విద్యుత్ సరఫరా కట్ చేయొద్దు : ఎస్ఈఆర్సీ