పన్నులు ఎగ్గొట్టి దిగుమతి చేస్తున్న వస్తువులను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలోడీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో.. నైజీరియా లాగోస్ నుంచి దిగుమతి చేసుకున్న సామగ్రిని తనిఖీ చేశారు. వస్తువుల విలువను తక్కువ చేసి చూపినట్లు గుర్తించిన అధికారులు రూ.41.24లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేశారు. వాటిలో నిషేధిత వస్తువులు కూడా ఉన్నట్లు తెలిపారు. మరో కార్గోలో రూ.11లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేశామని.... అన్ని కలిసి తూకం వేయగా 13టన్నులుగా తేలిందన్నారు. మొత్తం వాటి విలువ రూ. 52.24లక్షలని అధికారులు పేర్కొన్నారు. జులై 19న ఈ తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ సామగ్రి సీజ్ - airport
నైజీరియా లాగోస్ నుంచి దిగుమతి అవుతున్న రూ. 52.24 లక్షల విలువైన సామగ్రిని.. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. వస్తువుల విలువ తక్కువగా చూపెట్టినందుకు ఈ చర్య తీసుకున్నారు. పట్టుబడిన సామగ్రిలో నిషేధిత వస్తువులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

సీజ్ చేసిన వస్తువులు
Last Updated : Jul 26, 2019, 6:32 AM IST